నిర్మాత వివేక్ కూచిబొట్ల చేతుల మీదుగా ప్రవీణ్ ఐపీఎస్ మోషన్ పోస్టర్ విడుదల !!!

 

బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బయోపిక్ గా “ప్రవీణ్ ఐపిఎస్”

 

ఐరా ఇన్ఫోటైన్మెంట్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నీల మామిడాల నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం “ప్రవీణ్ ఐపిఎస్”, షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది.

 

నందకిషోర్, రోజా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా దుర్గా దేవ్ నాయడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

 

మాజీ ఐపిఎస్ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారి బయోపిక్ గా ప్రవీణ్ ఐపిఎస్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్ల గారు విడుదల చేశారు.

 

ఈ నెల 27న ప్రవీణ్ ఐపిఎస్ సినిమా టీజర్ ను విడుదల చెయ్యబోతోంది చిత్ర యూనిట్. నవంబర్ లో సినిమాను రిలీజ్ చెయ్యడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

 

నటీనటులు:

నంద కిషోర్, రోజా, దుర్గా దేవ్ నాయుడు, వన్య అగర్వాల్, సతీష్ సరిపల్లి, జ్యోతి తదితరులు

 

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: ఐరా ఇన్ఫోటైన్మెంట్ ప్రవేట్ లిమిటెడ్

నిర్మాత: నీలా మామిడాల

డైరెక్టర్: దుర్గా దేవ్ నాయుడు

మ్యూజిక్: ఎన్. ఎస్. ప్రసు

కెమెరామెన్: నాగ్ సోధనపల్లి

ఎడిటర్: ఆర్.ఎం. విశ్వనాధ్ కుచనపల్లి

లిరిక్స్: కిరణ్ ఓలేటి, రామ దుర్గం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here