లేతాకులు మూవీ ప్రారంభం

M R చౌదరి వడ్లబట్ల సమర్పణ లో ఫ్రెష్ మూవీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకటేష్ చిక్కాల నిర్మిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ “లేతాకులు ” హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది.. ఎస్తర్ కీలకపాత్ర లో నటిస్తున్న ఈ చిత్రాన్ని చంటి గాణమని తెరకెక్కిస్తున్నారు…ఎస్తర్ ,శృతి శరణ్ , అవయుక్త ,వంశీ పాండ్య హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బీసీ కమిషన్ చైర్మన్ వకలబరణం కృష్ణ మోహన్ రావ్ క్లాప్ నివ్వగా మోహన వడ్లపట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు.తమ్ముడు సత్యం స్క్రిప్ట్ అందివ్వగా ప్రముఖ దర్శకులు V సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు..అనంతరం

చిత్ర సమర్పకులు ఎం ఆర్ చౌదరి వడ్లపట్ల మాట్లాడుతూ … మా లేతాకులు సినిమా ఓ కొత్త కాన్పెస్ట్ లో వస్తుంది.. నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసిన అనుభవం నాకు ఉంది..కానీ దర్శకులు చంటి గాణమని చెప్పిన కథ , కథనం బాగా నచ్చాయి..క్లైమాక్స్ మాత్రం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ లో ఇప్పటివరకు ఇటువంటి కాన్పెస్ట్ రాలేదు..ఇది ముఖ్యంగా మహిళలకు బాగా నచ్చుతుంది.. ఈ సినిమా ను అన్నివర్గాల ప్రేక్షకుల కు నచ్చే విధంగా నిర్మిస్తున్నామని అన్నారు..

నిర్మాత వెంకటేష్ చిక్కాల మాట్లాడుతూ : దర్శకత్వ శాఖలో చాలా యేళ్లుగా పనిచేస్తున్నాను… కానీ చంటి గాణమని గారు చెప్పిన కథ బాగా నచ్చి సినిమాను నిర్మించడానికి ముందకు వచ్చాను… ఇటువంటి కథ నమ్మి ఎం ఆర్ చౌదరి వడ్లపట్ల గారు కూడా ఈ సినిమా లో భాగం అయ్యారు… ఎస్తర్ మా సినిమాలో కీ రోల్ చేస్తోంది.. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని , దసరా తర్వాత షూటింగ్ జరుగుతుందని , ముఖ్కమైన సన్నివేశాలను ఉత్తరప్రదేశ్ లో తీయనున్నట్లు తెలిపారు..

దర్శకులు చంటి గాణమని మాట్లాడుతూ .. నూతిలోకప్పలు సినిమా తర్వాత నేను చేస్తున్న సినిమా లేతాకులు ..ఒకరిని బాధ పెట్టిన వారికి ఏదో శిక్ష విధించడం శిక్ష కాదు అదే బాధ వాళ్ళకి కలిగాలా చేయడమే అసలైన శిక్ష అని అండర్ కరెంట్ గా చెప్పే కథ ఇది ..ఈ సినిమా కథ అందరికి నచ్చింది.. ఈ సినిమా చెయ్యడానికి నిర్మాతలు ఎంతో పాజిటివ్ ముందుకొచ్చారు.. మా సినిమా లో క్లైమాక్స్ హైలెట్ నిలుస్తుందని అన్నారు… మిగతా విషయాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు.

హీరోయిన్ ఎస్తర్ మాట్లాడుతూ : దర్శకులు చంటి గాణమని చెప్పిన కథ నాకు బాగా నచ్చింది.. నేను చేసిన సినిమాలతో పోల్చితే ఈ కథ డిఫరెంట్ గా ఉంటుంది… ముఖ్యంగా ప్రతి మహిళ చూడాల్సిన సినిమా .. నా కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ మూవీగా నిలుస్తుందని అన్నారు…

ఈసినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్స్ శృతి శరణ్ , అవయుక్త ,వంశీ పాండ్య కృతజ్ఞతలు తెలిపారు….వీరితో పాటు మోహన్ వడ్లపట్ల , నటులు అశోక్ కుమార్ పలువురు నటీనటులు పాల్గోన్నారు…

నటీనటులు : ఎస్తర్ ,శృతి శరణ్ , అవయుక్త ,వంశీ పాండ్య
ప్రొడ్యూసర్ :- వెంకటేష్ చిక్కాల
డైరెక్టర్ : – చంటి గాణమని
Dop :- మురళి మోహన్ రెడ్డి
పి.ఆర్ ఓ : దయ్యాల అశోక్
ఎడిటర్:- N తారక రామారావు
సంగీతం: – సుక్కు
గ్రాఫిక్స్ : హాక్ ఐ స్టూడియోస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here