ఘనంగా ” దక్ష “సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా , సీనియర్ నటులు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరో గా నటిస్తున్న సినిమా ” దక్ష “.

ఆగస్టు 25న థియేటర్ లలో విడుదల కి సిద్ధంగా ఉన్న ఈ సినిమా కి
వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక అతిరథ మహాశయుల మధ్యన జరిగింది.

ముఖ్య అతిధి గా వచ్చిన హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ” దక్ష” టీం అందరూ దీక్ష తో వాళ్ళ సినిమా ని తీయడం జరిగింది,
సినిమా విజయం సాంధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ “దక్ష” సినిమా టీం అందరూ చాలా యంగ్ టీం, టాలెంట్ ఉన్న సినిమా ని ప్రేక్షకులు ఎప్పుటికీ అ
ఆదరిస్తారు అని అన్నారు.

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ “తల్లాడ సాయికృష్ణ నాకు 11 సంవత్సరాల నుండి పరిచయం, నాకు మంచి ఆప్త మిత్రుడు, సాయికృష్ణ కి, డైరెక్టర్ విక్కీ కి , హీరో ఆయుష్ కి మంచి భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటున్నాను.

నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ
మా దక్ష తప్పకుండా ప్రేక్షకులకు కి నచ్చతుంది, మా కార్యక్రమానికి వచ్చిన అతిథులు గా విచ్చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు.

డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ మా టీం అందరం రెండు సంవత్సరాలు కష్టపడితే ఈ అవుట్ పుట్ వచ్చింది, మా సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో సినీ నటి స్వప్న చౌదరి, శబరి సినిమా ప్రొడ్యూసర్ మహీంద్రా నాథ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సాయి రాహుల్ తో పాటు

దక్ష సినిమా టీం సభ్యులు పాల్గొని
బిగ్ టికెట్ ని లాంచ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here