దర్శకుడు దశరథ్ చేతులమీదుగా “దక్ష” చిత్రం ట్రైలర్ విడుదల

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై  తల్లాడ శ్రీనివాస్ నిర్మాత గా , వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” దక్ష”. దివంగత నటుడు శ్రీ శరత్ బాబు గారి అబ్బాయి ఆయుష్ హీరో గా, అను, అఖిల్, రియా, నక్షత్ర ముఖ్య తారాగణం తో నిర్మించబడిన చిత్రం ” దక్ష”. ఈ చిత్రం యొక్క ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధి గా ప్రముఖ దర్శకుడు దశరథ్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ ఎక్స్ చైర్ మాన్ ఉప్పల శ్రీనివాస్, రేలంగి నరసింహారావు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గున్నారు. సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన దక్ష చిత్రం ట్రైలర్ ను దర్శకుడు దశరథ్ గారు మరియు ఉప్పల శ్రీనివాస్ గారు విడుదల చేశారు.

అనంతరం ఉప్పల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ “తల్లాడ సాయి కృష్ణ చిన్న వయసులోనే నిర్మాతగా దర్శకుడిగా సినిమాలు చేస్తున్నాడు. కరోనా టైం లో నమస్తే సెట్ జి చిత్రం తీసి మంచి విజయం సాధించారు, ఇప్పుడు దక్ష చిత్రం తో నిర్మాతగా వస్తున్నాడు. దివంగత నటుడు శ్రీ శరత్ బాబు గారి అబ్బాయి ఆయుష్ హీరోగా నటించాడు, ఆగస్టు 25న విడుదల అవుతుంది, ఈ చిత్రం మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.

జబర్దస్త్ నటుడు నవీన్ మాట్లాడుతూ “ట్రైలర్ చాలా బాగుంది, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం మంచి విజయం సాధించాలి. నేను తల్లాడ సాయి కృష్ణ కలిసి మిస్టరీ చిత్రం లో కలిసి పని చేసాము, అది కూడా విడుదలకు సిద్ధం అవుతుంది” అని తెలిపారు.

రేలంగి నరసింహారావు మాట్లాడుతూ “దక్ష ట్రైలర్ చాలా బాగుంది. యూత్ కి నచ్చినట్టుగా ట్రైలర్ ని కట్ చేసారు, సినిమా ఎలా ఉంటుందో అనే ఉత్సుకత కల్పించారు. సంగీతం కూడా బాగుంది. దివంగత నటుడు శ్రీ శరత్ బాబు గారి అబ్బాయి ఆయుష్ కి ఈ చిత్రం మంచి విజయం సాధించాలి. నిర్మాత తల్లాడ సాయి కృష్ణ కి మంచి భవిష్యత్తు ఉంది” అని తెలిపారు.

దర్శకుడు దశరథ్ గారు మాట్లాడుతూ “తల్లాడ సాయి కృష్ణ ది మా ఖమ్మం జిల్లా నే, అంత యంగ్ టాలెంట్ నటీనటులతో నిర్మించారు. మంచి విజయం సాధించాలి. తల్లాడ సాయి కృష్ణ ఫ్యూచర్ లో రామానాయుడు అంత పెద్ద నిర్మాత కావాలి” అని కోరుకున్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న మాట్లాడుతూ “తల్లాడ సాయి కృష్ణ మా బంధువు, మంచి టాలెంట్ ఉన్న మనిషి, ఈ దక్ష చిత్రం మంచి విజయం సాధించాలి” అని తెలియజేసారు.

హీరో ఆయుష్ మాట్లాడుతూ “రెండు ఏళ్లగా ఈ చిత్రాన్ని నిర్మించాము, ఈరోజు ట్రైలర్ విడుదల అయింది, మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా, దర్శకుడు వివేకానంద విక్రాంత్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి, బాగా కష్టపడ్డాం. దర్శకుడు మరియు నిర్మాత ఇద్దరు కష్టపడి పనిచేసారు. కొత్త కథ, స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉంటుంది. ఆగస్టు 25న విడుదల చేస్తున్నాం, అందరికి నచ్చుతుంది” అని తెలిపారు.

దర్శకుడు వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ “మా తల్లాడ సాయి కృష్ణ కి ఇప్పటివరకు ఈ సినిమా కథ తెలీదు, నా మీద నమ్మకం తో ఈ సినిమా చేసాడు. మా హీరోయిన్స్ అను, రియా, నక్షత్ర మాకు బాగా సపోర్ట్ చేశారు, ఆయుష్ కూడా మంచి టాలెంట్ ఉన్న నటుడు. బాగా కష్టపడి సినిమా చేసాం. ఆగస్టు 25న విడుదల. మంచి చిత్రం అందరికీ నచ్చుతుంది” అని తెలిపారు.

నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ “మా సినిమా లో నటించిన ప్రతి నటి నటుడు మరియు టెక్నీషియన్, తన సొంత సినిమా లాగా పని చేశారు, ఈరోజు ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ విడుదల కార్యక్రమానికి విచ్చేసిన దశరథ్ గారికి, ఉప్పల శ్రీనివాస్, రేలంగి నరసింహారావు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ అందరికీ ధన్యవాదాలు. మా సినిమా ఆగస్టు 25న విడుదల అవుతుంది, అందరు చూడండి, మీకు బాగా నచ్చుతుంది” అని తెలిపారు.

ఈ సినిమా కి కథ మాటలు -శివ కాకు,  డైరెక్షన్ – వివేకానంద విక్రాంత్, నిర్మాత- తల్లాడ శ్రీనివాస్, కో- ప్రొడ్యూసర్ – తల్లాడ సాయికృష్ణ,
సంగీతం – లలిత్

నటి నటులు – ఆయుష్ , అఖిల్,రవి రెడ్డి, అను, రియా,శోభన్ బోగరాజు, నక్షత్ర, పవన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా 25 ఆగస్టు న విడుదల అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here