Home Entertainment Aakasam Dati Vasthava Teaser is Out

Aakasam Dati Vasthava Teaser is Out

0
24
దిల్ రాజు ప్రొడక్షన్స్ క్యూట్ లవ్ స్టోరీ ‘ఆకాశం దాటి వస్తావా’.. ఆకట్టుకుంటోన్న టీజర్
ప్ర‌ముఖ నిర్మాత శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ నుంచి ప్రొడ‌క్ష‌న్ నెం.2గా రూపొందుతోన్న సినిమా `ఆకాశం దాటి వ‌స్తావా`. కొరియోగ్రాఫ‌ర్ య‌ష్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. కార్తీక ముర‌ళీధ‌ర‌న్ హీరోయిన్. శశి కుమార్ ముతులూరి ద‌ర్శ‌కత్వంలో హ‌ర్షిత్‌, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు.
72 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడబోతోన్నట్టుగా అనిపించింది. ఓయ్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్.. ఎప్పుడూ ఇదే పనా? బోర్ కొట్టదా? అంటూ హీరోయిన్ మాట్లాడే మాటలు.. ఎప్పుడూ ఇంతే అందంగా ఉంటావ్.. నీకు బోర్ కొట్టదా? అంటూ హీరో చెప్పే సమాధానంతో టీజర్ మొదలవుతుంది. ‘ఎన్ని సార్లు వస్తావ్ ఇలా?’ అని హీరోయిన్ అనడం.. ‘ఎన్ని సార్లైనా వస్తాను’ అని హీరో అనడం.. ‘ఎంత దూరమైనా వస్తావా?’ అని హీరోయిన్.. ‘అడిగి చూడు’ అని హీరో.. ‘అబ్బో అడినంత మాత్రానా సముద్రాలు దాటి ఆకాశం దాటి వస్తావా?’ అంటూ హీరోయిన్ సంభాషణలతో టీజర్ సాగింది.
ఈ టీజర్ ద్వారా సరికొత్త ప్రేమ కథను చూపించబోతోన్నట్టుగా దర్శక నిర్మాతలు చెప్పకనే చెప్పేశారు. ఈ టీజర్‌లో ర్యాంపీ నందిగాం అందించిన విజువల్స్, సింగర్ కార్తీక్ ఇచ్చిన మ్యూజిక్, యశ్ కార్తీక ముర‌ళీధ‌ర‌న్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. మొత్తానికి టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు.
బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తోన్న రెండో  చిత్రమిది. కొత్త టీంతో ఈ సారి మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. హీరో యశ్, హీరోయిన్ కార్తీక ముర‌ళీధ‌ర‌న్‌లు కొత్త వారే. ఈ సినిమాతో సింగర్ కార్తిక్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.
నటీనటులు : యశ్, కార్తీక ముర‌ళీధ‌ర‌న్
సాంకేతిక బృందం
బ్యానర్  : దిల్ రాజు ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పి
నిర్మాతలు  : హర్షిత్ రెడ్డి, హన్షిత
కథ, దర్శకత్వం :  శశి కుమార్ ముతులూరి
కెమెరామెన్  : ర్యాంపీ నందిగాం
సంగీతం  : కార్తీక్
ఎడిటర్  : మధు
పీఆర్వో :  వంశీ కాకా
https://youtu.be/0SKWVc5e-Gc

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here