Home Entertainment Danger Pilla Lyrical Song from Nithin’s Extra Ordinary Man Movie is Out

Danger Pilla Lyrical Song from Nithin’s Extra Ordinary Man Movie is Out

0
17

నితిన్ హీరోగా వ‌క్కంతం వంశీ డైరెక్ష‌న్‌, హారిస్ జైరాజ్ సంగీత సార‌థ్యంలో రూపొందుతోన్న ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’ నుంచి ‘డేంజర్ పిల్ల’ లిరికల్ సాంగ్ విడుద‌ల‌

 

‘‘అరె బ్లాక్ అండ్ వైట్‌ సీతాకోక చిలుక‌వా

చీక‌ట్లో తిర‌గ‌ని త‌ళుకువ‌

ఒక ముళ్లు కూడా లేనే లేని రోజా పువ్వా

రేర్ పీసే నువ్వా

క‌ల‌లు క‌న‌ద‌ట‌.. క‌న్నెతి క‌న‌ద‌ట‌.. క‌రుకు మ‌గువ‌ట హోయ్‌

న‌గ‌లు బ‌రువ‌ట.. గుణ‌మే నిధి అట.. ఎగిరి ప‌డ‌ద‌ట హోయ్‌

డేంజ‌ర్ పిల్లా.. డేంజ‌ర్ పిల్లా.. ’’

 

అని మ‌న‌సుకి న‌చ్చిన అమ్మాయి గురించి రెచ్చిపోయి పాట పాడేస్తున్నారు మ‌న హీరో నితిన్‌. ఇంత‌కీ అంతలా ఆయ‌న మ‌న‌సుని దోచుకున్న అమ్మాయి ఎవ‌రో తెలుసా!.. శ్రీలీల‌. ఓ వైపు ప్రేయ‌సి అందాన్ని పొగుడుతూనే డేంజ‌ర్ పిల్ల అని కూడా స్వీటుగా తిడుతున్నాడు మ‌రి. అస‌లు వీరి మ‌ధ్య అస‌లు వ్య‌వ‌హారం తెలుసుకోవాలంటే ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’ సినిమా చూడాల్సిందేనంటున్నారు డైరెక్ట‌ర్‌ వ‌క్కంతం వంశీ, నిర్మాత‌లు సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి.

 

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’. రైట‌ర్ – డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పటికే 60 శాతానికి పైగా చిత్రీకర‌ణ పూర్త‌య్యింది. బుధ‌వారం రోజున ఈ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల..’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

 

ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మైమ‌ర‌పింప చేసిన మ్యూజికల్ జీనియ‌స్ హారిస్ జైరాజ్ మ‌రోసారి త‌న‌దైన స్టైల్లో ‘డేంజర్ పిల్ల..’ సాంగ్‌కు వండ‌ర్‌ఫుల్ ఫుట్ ట్యాపింగ్ బీట్‌ను అందించారు. ఈ పాట‌ను కృష్ణకాంత్ రాయ‌గా, అర్మాన్ మాలిక్ ఆల‌పించారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించారు. నితిన్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి పాత్ర‌లో ఆకట్టుకోబోతున్నార‌ని, క‌చ్చితంగా ఆయ‌న అభిమానుల‌నే కాదు, ప్రేక్ష‌కుల‌ను కూడా నితిన్ త‌న బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించ‌నున్నారు. క్యారెక్ట‌ర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో.. కిక్ త‌ర్వాత ఆ రేంజ్ జోన్‌లో తెర‌కెక్కుతోంది. ఆడియెన్స్‌కి రోల‌ర్ కోస్ట‌ర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ న‌వ్విస్తూనే స‌ర్‌ప్రైజ్‌ల‌తో సినిమా మెప్పించ‌నుంది’’ అని డైరెక్టర్ వక్కంతం వంశీ అన్నారు.

 

శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here