రుద్రమాంబపురం సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ ప్రశంశలు !!!

 

తన ఎదుగుదలే కాక తన తోటి సహచర నటులకు కూడా చేయందించే అమృత హస్తం రకుల్ ప్రీత్ సింగ్ ది. ఎనిమిది సంవత్సరాల క్రితం కిక్2 షూటింగ్లో తనతో నటించిన సహచర నటులు రుద్రమాంబపురం అనే సినిమా తీస్తే, ఇప్పుడు వారి మీద అభిమానంతో ఎక్కడో దుబాయిలో వున్నా , సినిమాను చూసి ఆ సినిమాని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ సోషల్ మీడియా మాధ్యంలో అభినందనలు తెలిపారు రకుల్ ప్రీత్ సింగ్.

 

మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు , ఆచారాలు, వారి కష్ట సుఖాల మీద వచ్చిన చిత్రం రుద్రమాంబపురం.

 

ఎన్‌వీఎల్ ( NVL )ఆర్ట్స్ ప‌తాకంపై నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం. మ‌హేష్ బంటు ద‌ర్శ‌కత్వం వహించిన ఈ సినిమాకు మూల కథ అజయ్ ఘోష్. శుభోద‌యం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన చిత్రం `రుద్ర‌మాంబ‌పురం`. మూల‌వాసుల క‌థ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో విడుదలై మంచి స్పందన తో పాటు ట్రెండింగ్ లో ఉంది.

 

 

https://www.hotstar.com/in/movies/rudramambapuram/1260144050?filters=content_type%3Dmovie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here