Home Entertainment Comedy King Bramhanandam released Syeyara Song from Madhave Madhusudana

Comedy King Bramhanandam released Syeyara Song from Madhave Madhusudana

0
61

మాధవే మధుసూదన నుండి సైయారా.. సైయారా.. సాంగ్ లాంచ్ చేసిన బ్రహ్మనందం.

బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం మాధవే మధుసూదన, రెండవ లిరికల్ సాంగ్ డా. పద్మశ్రీ బ్రహ్మనందం గారు ఆవిష్కరించారు.


అనంతరం డా. బ్రహ్మనందం మాట్లాడుతూ.. మాధవే మధుసూదన సినిమా నుంచి సైయారా.. సైయారా.. సాంగ్ చూడడం జరిగింది. నేను బాగోక పోతే ఎవ్వరిని పొగడను. బొమ్మదేవర రామచంద్ర రావు కుమారుడైన తేజ్ బాగా యాక్ట్ చేసాడు. కంగ్రాట్యులేషన్ తేజ్ నీకు మంచి భవిష్యత్ ఉంటుంది. కొత్తకుర్రాడు అయినా చాలా ఈజ్ వుంది. డాన్స్ బాగా చేసాడు. డైరెక్టర్ బొమ్మదేవర రామచంద్ర రావు (చంద్ర) నాకు చాలా కాలంగా తెలుసు. కానీ ఇంత బాగా డైరెక్షన్ చేస్తాడని నేను అనుకోలేదు. మంచి అభిరుచి వున్నా చంద్ర, నిర్మాతగా కూడా మంచి విజయం సాధించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. పాట చాలా చాలా బాగుంది. కొరియోగ్రఫీ కూడా బావుంది. కొరియోగ్రాఫర్ రాజు సుందరం మాస్టర్ కి కంగ్రాట్యులేషన్. ఇక డైరెక్టర్ టీమ్ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అన్నారు.

దర్శక, నిర్మత బొమ్మదేవర రామచంద్ర రావు మాట్లాడుతూ.. డా. బ్రహ్మనందం సైయారా.. సైయారా… రెండవ లిరికల్ సాంగ్ విడుదల చెయ్యటం చాలా ఆనందంగా వుంది. చాలా కాలంగా నాతో ఆయనకు మంచి అనుబంధం వుంది. ఫోన్ చేసి అడిగిన వెంటనే ఇంటికి రమ్మని నా బిడ్డ తేజ్ ను ఆశ్విరదించిన బ్రహ్మనందం గారికి ఆయన సతీమణి లక్ష్మి గారికి ఎప్పుడూ రుణపడి వుంటాను. ఈ పాట ఆదిత్య మ్యూజిక్ లో వున్నది. మిస్ అవకుండా చూడండి. ఈపాటను వైష్ణవి కొవ్వూరి పాడారు. మిగిలిన పాటలు త్వరలో విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాకు వికాస్ బాడిస అందించిన సంగీతం మేజర్ హైలెట్. వాసు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్. ఉద్దవ్ ఎస్ బి ఈ సినిమాకు ఎడిటర్‌గా బాగా వర్క్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తాము అన్నారు.

నటీ నటులు: తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే, జయ ప్రకాష్, సుమన్, రామచందర్, శైలజా ప్రియ, నవీన్ నేని, విజయ్ మాస్టర్, బేబీ సమన్విక, రవి శివ తేజ, మాస్టర్ అజయ్, అంజలి, శ్రీలత తదితరులు.

సమర్పణ: బొమ్మదేవర శ్రీదేవి, బ్యానర్: సాయి రత్న క్రియేషన్స్, రచన-దర్శకత్వం, నిర్మాత: బొమ్మదేవర రామచంద్ర రావు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వాసు, సంగీతం: వికాస్ బాడిస, ఎడిటింగ్: ఉద్దవ్ ఎస్ బి, మాటలు: బి సుదర్శన్, కొరియోగ్రఫీ: రాజు-సుందరం, బృంద, రఘు, యాష్, పాటలు: శ్రీమణి, అనంత శ్రీరామ్, విరించి పుట్ల, సింగర్స్: విజయ్ ప్రకాష్, అనురాగ్ కులకర్ణి, కపిల్ కపిలన్, రమ్య బెహ్రా, హరిప్రియ, వైష్ణవి కొవ్వూరి, ఫైట్స్: విజయ్ మాస్టర్, ఆర్ట్ డైరెక్టర్ మోహన్ కె తాళ్ళూరి, స్టిల్స్: పాండియన్, కో డైరెక్టర్: మురళి.యన్, పి.ఆర్.ఓ: పర్వతనేని రాంబాబు, సాయి సతీష్, పబ్లిసిటీ డిజైనర్: కృష్ణ ప్రసాద్, ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్: మానుకొండ మురళీకృష్ణ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here