Home Entertainment Lakshmi Rai’s Janatabar Motion Poster is Out

Lakshmi Rai’s Janatabar Motion Poster is Out

0
33
రాయ్‌లక్ష్మీ జనతాబార్ మోషన్ పోస్టర్ విడుదల
రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం జనతాబార్. రమణ మొగిలి దర్శకుడు. అశ్వర్థనారాయణ సమర్పణలో రోచి శ్రీ మూవీస్ సంస్థ పతాకంపై రమణ మొగిలి, తిరుపతి రెడ్డి బీరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు పరశురామ్ ఉగాది రోజున విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమర్షియల్ విలువలతో పాటు ఓ బర్నింగ్ ఇష్యూను డీల్  చేస్తూ రూపొందించిన ఈ చిత్రం విజయవంతం కావాలి. టైటిల్ కూడా క్యాచీగా వుంది. దర్శకుడు రమణ మొగిలికి ఈ చిత్రం మంచి పేరును తీసుకరావాలి అన్నారు.
దర్శక నిర్మాత రమణ మొగిలి మాట్లాడుతూ రాయ్‌లక్ష్మీ కెరీర్‌లోనే ఇదొక డిఫరెంట్ చిత్రం. ఆమె పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని  చేస్తున్న సెక్సువల్ హారాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది. పూర్తి కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి చక్కని సందేశాన్ని జోడించి రూపొందించిన సినిమా ఇది. దర్శకుడు పరశురామ్ చేతుల మీదుగా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల కావడం శుభసూచకంగా భావిస్తున్నాం. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.  తప్పకుండా చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు అన్నారు.
శక్తికపూర్, ప్రదీప్‌రావత్, అనూప్‌సోని, విజయ్‌భాస్కర్, దీక్షాపంత్, అమీక్ష,, మిర్చిమాధవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యజమాన్య, ఎడిటింగ్: ఉద్ధవ్, ఫైట్స్:డ్రాగన్ ప్రకాష్, అంజి, మల్లేష్, డిఓపీ: అంజి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సిరాజ్, రచన: రాజేంద్ర భరద్వాజ్, కొరియోగ్రఫీ: సుచిత్ర చంద్రబోస్, అశోక్ రాజ, అజయ్, అశ్వర్థనారాయణ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here