నిఖిల్ సిధ్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్. జీఎ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. బన్ని వాసు నిర్మాత. అల్లు అరవింద్ సమర్పణ. సూర్య ప్రతాప్ పల్నాడు దర్శకత్వం వహించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవలే కార్తికేయ2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిఖిల్, అనుపమ… ఈ చిత్రంతో ఏమాత్రం ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశారో చూద్దాం పదండి.

కథ: సిధ్దూ(నిఖిల్) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. తన ఫస్ట్ లవ్ బ్రేకప్ అయిన తరువాత అనుకోకుండా ఓ డైరీ తనకి దొరుకుతుంది. ఆ డైరీలో ఒక్కొక్క పేజీ చదవడం ప్రారంభిస్తాడు సిద్ధూ. అందులో నందిని(అనుపమ) అనే అమ్మాయి సెల్ ఫోన్ వాడదు, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా… ఇలా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ కి దూరంగా ఉంటూ… వ్యక్తులతో ఇంట్రాక్ట్ అవుతూ వుంటుంది. హ్యూమన్ ఇంట్రాక్షన్ మెయిన్ అనే పాయింట్ తో టైంతో పరుగెత్తకుండా తన దైనందిన జీవితాన్ని లీడ్ చేస్తూ… ఓ సాధారణ అమ్మాయిగా జీవించేస్తూ వుంటుంది. అయితే తన తాత ఆమెకు ఓ కవర్ ఇచ్చి… దాన్ని వెంకట్రావ్ అనే వ్యక్తికి అందజేయాలని చెప్పి చనిపోతారు. ఆ కవర్ తీసుకుని… వెంకట్రావ్ ని వెతుక్కుంటూ… నగరానికి వచ్చేస్తుంది. మరి నగరానికి వచ్చిన నందిని ఆ కవర్ ని వెంకట్రావ్ కి అందజేసిందా? అసలు ఆ కవర్ లో ఏముంది? ఆమెను తల్వార్( అజయ్) ఎందుకు చంపాలనుకున్నాడు? చివరకు సిద్ధూ నందినికి ఎలా దగ్గరయ్యాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!

కథ… కథనం విశ్లేషణ: సుకుమార్ రైటింగ్స్ లో సినిమా అనగానే… ఓ సెన్సిబుల్ లవ్ స్టోరీకి… కొద్దిపాటి డ్రామా తోడై… ఫీల్ గుడ్ డీసెంట్ లవ్ స్టోరీస్ తెరకెక్కిస్తారనే టాక్ వుంది. గతంలో సుకుమార్ రైటింగ్స్ లో సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన కుమారి 21ఎఫ్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు 18 పేజెస్ కూడా అలాంటి సెన్సిబుల్ లవ్ కథ… కథనాలను కొంచెం డ్రామా జోడించి తెరకెక్కించారు. డీసెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్, అనుపమ జంట మధ్య అల్లిన సెన్సిటివ్ లవ్ స్టోరీ చాలా డీసెంట్ గా వుంది. ఫస్ట్ హాఫ్ లో నందిని స్టోరీరి డైరీ ద్వారా తెలుసుకున్న సిద్ధూ… ఆమెకోసం దేనికైనా సిద్ధ పడటం… ఆమెను ఎలాగైనా ప్రమాదంలో నుంచి బయటపడేయాలనే తపన వున్న యువకుని పాత్రలో మెప్పించాడు. అలాగే… అనుపమ కూడా నందిని పాత్రలో తన మెచ్యూరిటీని ప్రదర్శంచింది. సెల్ ఫోన్లకు, సోసియల్ మీడియాకు దూరంగా వుండే అమ్మాయి పాత్రలో ఒదిగిపోయి నటించింది. నలుగురికి చేతననైన సహాయం చేస్తూ… జీవితాన్ని హాయిగా లీడ్ చేసే పాత్ర చాలా జెన్యూన్ గా తెరమీద కనిపిస్తుంది. అలాగే ప్రేమించడానికి కారణాలు ఉండవు… ప్రేమించడానికి ఓ మంచి కారణం కూడా కవచ్చు అనే దాన్ని చూపించారు. ఓవరాల్ గా 18 పేజెస్… ఓ డీసెంట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.

నిఖిల్ మరోసారి తనకిష్టమైన లవర్ బాయ్ జోనర్ లో కనిపించి మెప్పించారు. ఎక్కడా ఓవర్ అనేది లేకుండా చాలా డీసెంట్ గా సిద్ధూ పాత్రలో కనిపించారు. అలాగే అనుపమ కూడా. నేచర్ ని ఇష్టపడే అమ్మాయిగా చాలా బాగా నటించారు. క్లైమాక్స్ సీన్ అయితే… నిఖిల్, అనుపమ జంట… అజిత్, దేవయాని నటించిన ప్రేమలేఖ సినిమా క్లైమాక్స్ లాగే… ప్రేక్షకుల హృదయాన్ని తాకుతుంది. అంత బాగా నటించారు వీరిద్దరూ. నిఖిల్ తో పాటు సినిమా త్రూ అవుట్ కనిపించే పాత్ర సెవెన్ ఆర్ట్స్ సరయుది. ఆమె పాత్రకి కూడా మంచి డైలాగ్స్ రాసి.. ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేశారు. ఇక మిగతా పాత్రల్లో కనిపించిన అజయ్, శత్రు, పోసాని కృష్ణ మురళి తదితరులు అంతా తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు రాసుకున్న కథ… కథనం బాగుంది. లవ్ స్టోరీని చాలా వైవిధ్యంగా తెరమీద ఆవిష్కరించారు. నేటి వయుత సెల్ ఫోన్స్, సోసియల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ మీద పడి… టైంపాస్ ఎలా చేస్తున్నారనేదాన్ని సున్నితంగా నందిని పాత్రతో చెప్పించారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం హైలైట్ గా నిలిచింది. ప్రతి సన్నివేశంలోనూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా మెప్పిస్తుంది. సినిమాటోగ్రాఫర్… నిఖిల్, అనుపమలను చాలా అందంగా చూపించారు. అలాగే లవ్ లో వున్న ఫీల్ ని తెరమీద చక్కగా ఆవిష్కరించారు. ఎడిటింగ్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా క్వాలిటీగా వున్నాయి. గో అండ్ వాచ్ ఇట్.

రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here