కంటెంట్ ఉన్న సినిమా నమస్తే సెట్ జీ….
– విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్…
– సక్సెస్ మీట్ లో చిత్ర బృందం…

హైదరాబాద్ 10.12.2022: కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని తన సినిమాతో మరోసారి నిరూపితమైందని దర్శకుడు, సినీ హీరో తల్లాడ సాయిక్రిష్ణ తెలిపారు. కరోనా సమయంలో కిరాణా షాపుల ఔన్నత్యాన్ని తెలియజేయడం లో భాగంగా తల్లాడ సాయి క్రిష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘నమస్తే సెట్ జీ సినిమా శుక్రవారం విడుదలైన అన్ని థియేటర్లలో హౌజ్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ వేదికగా ఏర్పాటు సక్సెస్ మీట్ లో

హీరో సాయి క్రిష్ణ మాట్లాడుతూ… తెలంగాణ వ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని అన్నారు. మిరాజ్ థియేటర్ లో టిక్కెట్లు ఫుల్ అయిపోవడంతో కొందరు తిరిగి వెళ్ళడం ఒక విధంగా బాధగానూ, మరో విధంగా సంతోషంగానూ ఉందన్నారు. సినిమాలోని కొన్ని డైలాగ్స్, కామెడీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ఈ రెండు రోజుల్లో మరి కొన్ని థియేటర్లు పెరగనున్నాయని ఆయన తెలిపారు. సినిమాలో కనపడని కెమెరా కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చిందని, గెలిచిన అన్ని జిల్లాల్లోనీ ప్రేక్షకులకు బహుమతులు అందిస్తామన్నారు. చిన్న సినిమాలకు కూడా థియేటర్ యాజమానుల నుంచి ప్రోత్సాహం లభించడం మంచి పరిణామమని అన్నారు.

కథానాయిక స్వప్నా చౌదరి అమ్మినేని మాట్లాడుతూ.. తన మొదటి సినిమాకే అభిమానుల నుంచి ప్రశంసలు రావడం సంతషంగా ఉందని అన్నారు. కేవలం కిరణషాపు వాళ్ళకే కాకుండా చిన్నారులు నుంచి పెద్దవారి వరకు అందరినీ ఈ సినిమా అలరించిందని ఆమె అన్నారు.

చిన్న సినిమాలకు కూడా ఇలాంటి ఆదరణ రావాలని, ఈ సపోర్ట్ చిన్న సినిమాలను బతికిస్తుందని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు.
వినూత్న కథాంశంతో సాయి క్రిష్ణ ఈ సినిమా తీసి విజయం సాధించారని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here