పల్లెటూరి కథ ‘నమస్తే సేట్ జీ’…
కరోనా సమయంలో కిరాణా షాపు యజమానులు సమాజానికి ఏ విధంగా అండగా నిలిచారనే కథాంశంతో నిర్మించిన ‘నమస్తే సేట్ జీ’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు విడుదలైంది. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ పైన తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహించి తనే హీరోగా నటించారు. ఈ సినిమాతో స్వప్నా చౌదరి అమ్మినేని కథానాయికగా పరిచయమైంది.
కథ: కరోనా పరిస్థితుల్లో తన గ్రామానికి వచ్చి కిరాణా షాపు నిర్వహించే కిరణ్ అనే వ్యక్తి చుట్టూ జరిగే సంఘటనల సమూహారం. అదే ఊరిలో వర్క్‌ఫ్రమ్ హోమ్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకునే కథానాయిక పవిత్ర కిరణ్‌కు పరిచయమైతుంది. కరోనా సమయంలో కిరాణా షాపు యజమానలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, హీరో హీరోయిన్‌ల మధ్య పరిచయం ప్రేమగా మారిందా లేదా అనే అంశాల మధ్య కథ నడుస్తుంది. తన గ్రామానికి ఏదైనా చేయలనే ఆలోచన ఉన్న కిరణ్ ఏం చేశాడన్నది మరో అంశం.
సినిమా అంతా మంచి పల్లెటూరి వాతావరంలో కొనసాగుతుంది. కనిపించకుండా మాట్లాడే కెమెరా సినిమాను మొత్తం నడిపిస్తుంది. స్వీయ దర్శకత్వంలో హీరో తల్లాడ సాయి కృష్ణ నటన ఆకట్టుకుంటుంది. కిరాణా షాపు నిర్వాహాకుల కష్టాలను చూపించడంలో, వారు కూడా కరోనా వారియర్స్ అని చెప్పే ప్రయత్నానికి తనవంతు కృషి చేశారు. హీరోయిన్ స్వప్న పల్లెటూరి సాఫ్ట్‌వేర్‌గా క్యారెక్టర్‌లో నిమగ్నమైంది. మొదటి సినిమా అయినా నటనలో జాగ్రత్తలు తీసుకుంది. నమస్తే సేట్ జీ సినిమాలో ఎవరూ మేకప్ వేసుకోకపోవడం విశేషం. ఈ సినిమాలో డప్పు మల్లన్నగా నటించిన శోభన్ బోగరాజు ఈ సినిమాలో కీలకంగా వ్యవహారిస్తారు. తన డైలాగ్స్, టైమింగ్ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ తవ్వ అందించిన సంగీతం మరో ఆకర్షణ. బ్యాక్ రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించినా జానపద నేపథ్యమున్న పాట అలరిస్తుంది. సినిమాలోని ల్యాగ్, అక్కడక్కడ వీడయో క్లారిటీ సరిగా లేకపోవడం మూవీకి మైనస్‌లుగా మారాయి. కరోనా పరిస్థితులతో పాటు పర్యావరణానికి సంబంధించిన అంశాన్ని వివరించే ప్రయత్నం వినూత్నంగా ఉంది. పల్లెటూరి ప్రజల యాస, ఆలోచనా విధానం ఆసక్తికరంగా ఉంటుంది. ఓవరాల్‌గా సినిమా పర్వాలేదనిపిస్తుంది.
నమస్తే సేట్ జీ
దర్శకుడు, హీరో: తల్లాడ సాయిక్రిష్ణ
హీరోయిన్: స్వప్నాచౌదరి అమ్మినేని
కీలకపాత్రలో శోభన్ బోగరాజు
సంగీతం: రామ్ తవ్వ
నిర్మాత: తల్లాడ శ్రీనివాస్
3/5.