‘ధర్మచక్రం’ ఫస్ట్ లుక్ విడుదల..

సంకేత్ తిరుమనీడి, మౌనిక చౌహాన్ జంటగా పద్మ నారాయణ ప్రొడక్షన్ బ్యానర్ లో నాగ్ ముంతా దర్సకత్వం లో తెరకెక్కిస్తున్న సినిమా ధర్మచక్రం. సందేశాత్మక కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా “ధర్మచక్రం” ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆనంద్ మరుకుర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు.. ప్రణయ్ రాజపూటి సంగీతం అందిస్తున్నారు.

దర్శకుడు నాగ్ ముంతా మాట్లాడుతూ.. ‘ ధర్మచక్రం మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిస్తున్నాము. సమాజంలో ఆడవాళ్ళపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఆకృత్యాల నేపథ్యంలోనే ఈ చిత్ర కథ ఉంటుంది. అమ్మాయిల స్వీయ రక్షణ ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తున్నాము. హీరోయిన్ మోనిక చౌహన్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీ అనౌన్స్ చేస్తాము..’ అని తెలిపారు.

నటీనటులు:

సంకేత్ తిరుమనీడి, మౌనిక చౌహాన్, చైతన్య, ప్రవీణ్ కుమార్, ధృవ, జానీ ఫీవర్ మైలవరం, నరసింహా రావు తదితరులు..

టెక్నికల్ టీమ్:

దర్శకుడు: నాగ్ ముంతా
నిర్మాత: జిపి రెడ్డి
సినిమాటోగ్రఫర్: ఆనంద్ మరుకుర్తి
సంగీతం: ప్రణయ్ రాజపూటి
యాక్షన్: హంగామా కృష్ణ బమ్మిడి
పి ఆర్.ఓ : లక్ష్మీ నివాస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here