సెంటిమెంట్ తో ఆకట్టుకునే “అందరూ బాగుండాలి అందులో నేనుడాలి”

కామెడియన్ ఆలీ మంచి టెస్ట్ వున్న నటుడు. ఆయన నటించే చిత్రాలు ఎంత చూజీగా వుంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన నిర్మాతగా మారి నటించిన చిత్రం కూడా అంతే స్థాయిలో ఆలీ టెస్ట్ కి తగ్గట్టుగానే వుంది. మలయాళంలో మంచి విజయం సాధించిన వికృతి అనే సినిమాని తెలుగులో తన సొంత నిర్మాణ సంస్థలో రీమేక్ చేసి ఆహా ఓ టి టిలో విడుదల చేశారు. అలీ సమర్పణలో అలీవుడ్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై అలీ, నరేష్‌ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో అలీబాబ, కొణతాల మోహన్‌కుమార్‌, శ్రీ చరణ్‌ ఆర్‌. లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం పదండి.

కథ: శ్రీనివాసరావు(నరేష్) ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. మూగవాడైన శ్రీనివాస రావు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. దుబాయ్ నుంచి వచ్చిన సమీర్(ఆలీ)కి సోషల్ మీడియా అంటే బాగా పిచ్చి.. ఏదైనా సరే సోషల్ మీడియాలో అలా షేర్ చేయడం …. వాటిని వైరల్ చేయడం బాగా అలవాటు. ఈ క్రమంలో ఓ రోజు ట్రైన్ లో శ్రీనివాసరావు పడుకున్న పొజిసిన్ చూసి ఫన్నీగా ఉందని అతడికి తెలీకుండా దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. అది బాగా వైరల్ అవుతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగి అయిన దీని వాళ్ళ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు ? శ్రీనివాసరావు లైఫ్ ఎలా మారిపోయింది? సమీర్ పై అతడు ఎందుకు కంప్లైంట్ చేస్తాడు? ఈ ఇద్దరికీ లింక్ ఏమన్నా ఉందా? చివరికి ఏమవుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

కథ… కథన విశ్లేషణ: కామెడియాన్ అలీ మలయాళం లో హిట్టైన ఓ మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకి చూపించడానికి తన తోలి సినిమాగా ఈ చిత్రాన్ని ఎన్నుకున్నందుకు అభినందించాలి. ఎందుకంటే వికృతి మూవీ మలయాళంలో విడుదలైన ఓ డీసెంట్ సినిమా. దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి అందులోను సీనియర్ నటుడు నరేష్ ని ముగా పాత్రకి ఎన్నుకోవడం… మరో పాత్రని అలీ నే చేయడం పర్ఫెక్ట్ కాస్ట్ సెలక్షన్. ప్రస్తుతం మనం ప్రస్తుత సమకాలీన ప్రపంచంలో సోషియల్ మీడియా పోకడలను చూస్తూనే వున్నాం. దానివల్ల ఎంత ఉపయోగం ఉందొ.. అనర్థ కూడా అంతే వుంది. దాన్ని స్పృహ లేకుండా వాడితే ఎంతటి అనార్థాలకు దారి తీస్తాయో అనేది మంచి ఎమోషన్ తో తేరకెక్కిన చిత్రమిది. నరేష్ ముగా వానిగా… ఆలీ సోసియల్ మీడియా పిచ్చి విన్న వానిగా ఇందులో పోషించిన పాత్రలు హృదయానికి హత్తుకుంటాయి. ముగవాడైనా… తనకున్న కుటుంబాన్ని ఎంత అందంగా చేసుకుంటాడో చక్కగా చూపించాడు. దర్శకుడు తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని తెలుగీకరించి ఫీల్ గుడ్ మూవీ గా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఎంతో ప్రశాంతంగా వున్న కుటుంబంలో సెల్ఫీ సమీర్ పాత్ర చేసిన అలజడిని దర్శకుడు ఎంతో సందేశాత్మకంగా తెరమీద చూపించారు. ప్రశాంతతకు మారు పేరు శ్రీనివాస రావు అయితే… సౌండ్ పొల్యుషక్ మారు పేరు సమీర్. ఈ రెండు పాత్రలకితోడు సప్తగిరి, కామెడియాన్ భద్రతో కామెడీతో ప్రేక్షకులని మెప్పించాడు.

ప్రధాన పాత్రలో నటించిన నరేష్ తన పాత్రకి ప్రాణం పోశారు. చాలా మెచ్యూర్ గా నటించారు. తన మూగ నటనతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఓ మూగ వ్యక్తిగా తాను పండించిన హావభావాలు హృదయాన్ని తాకుతాయి. ముఖ్యంగా తన ఫోటోలు వైరల్ అయిన సందర్భంలో వచ్చిన సీన్స్ లో అయితే తన నటన సూపర్బ్ గా ఉంది. ఇందులో సెల్ఫీ సమీర్ గా ఆలీ చేసిన పొల్యుషన్ అంతా ఇంతా కాదు. ఈ చిత్రానికి నిర్మాత కూడా అయినా ఆలీ చాలా రోజుల తర్వాత తన మార్క్ ఇంట్రెస్టింగ్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడు. చాలా కాలం తరువాత సీనియర్ నటి మంజు భార్గవి తల్లి పాత్రలో ఆకట్టు కుంటుంది. నరేష్ భార్య పాత్రలో పవిత్ర లోకేష్ పర్వాలేదు అనిపించే పాత్ర చేశారు. హెరాయిన్ మౌర్యాని కూడా ఆకట్టు కుంటుంది. మను, తనికెళ్ళ భరణి, ఎల్‌బి శ్రీరామ్ సప్తగిరి భద్రం తమ తమ పాత్రలకి న్యాయం చేశారు.

మలయాళంలో మంచి హిట్ సాధించిన వికృతి సినిమాని దర్శకుడు కిరణ్ తెలుగులో రీమేక్ చేసిన విధానం బాగుంది. స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త ద్రుష్టి సారించి ఉంటే బాగుండేది. సంగీత బాగుంది. మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. విజువల్స్ బాగున్నాయి. సంభాషణలు కొంత డబుల్ మీనింగ్ తో వున్నా యూత్ ని బాహీగా ఎంటర్టైన్ చేస్తాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని సరదాగా చూసేయండి.

రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here