Home Entertainment Raithe Raaju song from Sedyam Movie is Out

Raithe Raaju song from Sedyam Movie is Out

0
70

సేద్యం చిత్రం నుంచి రైతే రాజు అనే పాట విడుదల

జి పి ఆర్ సినిమాస్ పతాకం పై గౌతమ్ గిరినందన్, కుషాల్ తేజ, నీల రమణ, గాయత్రి రమణ హీరో హీరోయిన్ గా చంద్రకాంత్ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్న “సేద్యం” చిత్రాని మహేష్ రెడ్డి గోరకాటి, గాజుల పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొత్తం రాయలసీమ లో జరిగిన కొన్ని దారుణమైన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే ఈరోజు రైతే రాజు అనే పాటని మధుర ఆడియో ద్వారా విడుదల చేసారు. ఈ పాటని పృథ్వి రాజ్ లిరిక్ అందించి స్వరపరిచారు మరియు తానే సంగీతం అందించాడు.

ఈ సందర్బంగా దర్శకుడు నిర్మాత మాట్లాడుతూ “ఈ సేద్యం సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని నవంబర్ లో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉన్నాయి. ఇందులోని మొదటి రైతే రాజు పాటను మధుర ఆడియో లో ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాని మొత్తం రాయలసీమ లో చిత్రిరించం. అందరికి నచ్చే అందమైన కథ” అని తెలిపారు.

ఈ సేద్యం చిత్రానికి నిర్మాతలు మహేష్ రెడ్డి గోరకాటి, గాజుల పద్మావతి లు, సహా నిర్మాతగా డాక్టర్ విజయ్ పాల్ రెడ్డి. సేద్యం సినిమా దర్శకుడు చంద్రకాంత్ పసుపులేటి, ఛాయాగ్రహకుడు గోరకాటి విష్ణువర్ధన్ రెడ్డి, ఉన్నారు.ఇందులో
ముఖ్య పాత్ర నటి నటులు నీల రమణ, గాయత్రి రమణ, విద్యమధు, కుషాల్ తేజ, గిరినాథం గౌతమ్, అశోక్ రత్నం, గోపాల్ కృష్ణ, పసుపులేటి శ్రీనివాసులు, నివాస్ ,అన్వేష్ తదితరులు నటించారు.
అలాగే గానం, సంగీతం , లిరిక్స్ ఎం.సీ పృథ్వి రాజ్,
ఎడిటర్: మిక్కీ శ్రీనివాస్, అజయ్ కొందం.
కొరియో గ్రాఫర్ : వినోద్జీ మరాఠీ
నేపథ్య సంగీతం: అరుణ్ కీస్
అసోసియేట్ డైరెక్టర్: చేగువేరా హరి.
PRO: పవన్ పౌల్ మరియు Dr” రాగసాయి ఆలంపల్లి, అంజిమొన్, అఖిల్ కాతోజ తదితరులు సేద్యం సినిమాకి సేవలందించారు.

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here