Home Entertainment Baby Osey Baby song from Leharayi movie is Out

Baby Osey Baby song from Leharayi movie is Out

0
125

“లెహరాయి” చిత్రం నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంస ని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం లెహరాయి.

ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమ‌స్ కావ‌టం విశేషం. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కు, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది. ఇక సంగీత ద‌ర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన గుప్పెడంత సాంగ్ మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకుంది.

ఈ స‌క్సస్ ని పురస్కరించుకుని లెహ‌రాయి చిత్రం నుండి “బేబీ ఒసేయ్ బేబీ” అనే మరో సాంగ్ ను కూడా విడుద‌ల చేశారు మేకర్స్. గేయ రచయిత కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటని సాకేత్, కీర్తన శర్మ ఆల‌పించారు. ఉత్సాహభరితమైన పాటలను రాసే శ్యామ్ ఈ పాటను కూడా అదే తరహాలో రాసారు.
“గాడి మీద కూసోబెట్టి ఊరు మొత్తం తిప్పుతుంటే
జోడి మస్తు గున్నదంటూ సూసినోళ్లు మెచ్చబట్టే…
లేడీపిల్ల దుమ్కినట్టు జోరుమీద నువ్వు ఉంటే
ఏడికంటె ఆడికొచ్చి దాడిచెయ్య బుద్ధిపుట్టే
దూరమెంత ఉన్నాగాని దారమల్లె చుట్టేస్తా”
లాంటి లైన్స్ మరోసారి కాసర్ల శ్యామ్ మార్క్ ను గుర్తుచేశాయి.

ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నట్లు, మంచి ఫీల్ వున్న క‌థతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించినట్లు ఇదివరకే ద‌ర్శకుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస” తెలిపారు.ప్రముఖులు న‌టించిన ఈ చిత్రాన్ని నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్నారు. లెహరాయి రిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.

నటీనటులు: రంజిత్, సౌమ్య మీనన్, గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ,సత్యం రజెష్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు.

సాంకేతిక నిపుణులు :

సమర్పకులు : బెక్కం వేణుగోపాల్

బ్యానర్ : ఎస్ ఎల్ ఎస్ మూవీస్

నిర్మాత : మద్దిరెడ్డి శ్రీనివాస్

రైటర్, డైరెక్టర్ : రామకృష్ణ పరమహంస

మ్యూజిక్ : జీకే (ఘంటాడి కృష్ణ)

డి.ఓ.పి : ఎం ఎన్ బాల్ రెడ్డి

ఎడిటర్ : ప్రవీణ్ పూడి

లిరిక్ రైటర్స్ : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ , శ్రీమణి

ఫైట్ మాస్టర్ : శంకర్

కొరియోగ్రాఫర్స్ : అజయ్ సాయి

రైటర్ : పరుచూరి నరేష్

పి ఆర్.ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here