దర్శకుడు శేఖర్ కమ్ముల క్లాప్ తో ప్రారంభం అయిన E 3 with Love  చిత్రం
ఎస్‌వీఎన్ రావ్ సమర్పణలో శ్రీకాంత్ పరకాల మరియు శివ ప్రధాన పాత్రల్లో దీక్షిత్ కోడెపాక రచన, దర్శకత్వంలో వాయుపుత్ర క్రియేషన్స్ పతాకం పై నిర్మించబడుతున్న “E 3 with Love” చిత్రం హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ లో ఘనంగా ప్రారంభం అయ్యింది. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కి దర్శకుడు శేఖర్ కమ్ముల క్లాప్ ఇవ్వగా ఎస్ వి ఎన్ రావు మరియు తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం లో  దర్శకుడు సతీష్ వేగ్నేశ కూడా పాల్గొన్నారు.
అనంతరం పాత్రికేయుల సమావేశంలో
ఎస్ వి ఎన్ రావు మాట్లాడుతూ “గాంధీ జయంతి నాడు “E 3 with Love” అనే చిత్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శేఖర్ కమ్ముల గారికి, సతీష్ వేగ్నేశ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న టెక్నిషన్స్ అందరు కొత్తవాళ్లు మరియు యూత్. వీళ్ళు ఎంత యంగ్ గా ఉన్నారో విరి సినిమా కూడా అంతా కొత్తగా ఉంటుంది” అని కోరుకున్నారు.
దర్శకుడు దీక్షిత్ కోడెపాక మాట్లాడుతూ “ఇది నా మొదటి సినిమా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శేఖర్ కమ్ముల గారికి, సతీష్ వేగ్నేశ గారికి ధన్యవాదాలు. ఈ చిత్రం ఇద్దరి స్నేహితుల మధ్య జరిగే కథ. చిత్రం పేరు “E 3 with Love “. అక్టోబర్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది” అని తెలిపారు.
హీరో శ్రీకాంత్ పరకాల మాట్లాడుతూ “మా E 3 with Love  చిత్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన శేఖర్ కమ్ముల గారికి, సతీష్ వేగ్నేశ గారికి ధన్యవాదాలు. నేను ఈ చిత్రం లో ప్రధాన పాత్ర చేస్తున్న. కథ చాలా బాగా వచ్చింది, అందరికి నచ్చుతుంది” అని తెలిపారు.
బ్యానర్ : వాయుపుత్ర క్రియేషన్స్
చిత్రం పేరు : E 3 with Love
సమర్పణ : ఎస్ వి ఎన్ రావు
నటి నటులు : శ్రీకాంత్ పరకాల, శివ
కెమెరా మాన్ : అల్లాడి ప్రణవ్ చంద్ర
ఎడిటర్ : నగేష్ పి కె
పి ఆర్ ఓ : పాల్ పవన్
కథ , దర్శకత్వం : దీక్షిత్ కోడెపాక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here