అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తో తమిళ నిర్మాత కలై పులి ఎస్ థాను, గీతా ఆర్ట్స్ సమర్పణలో ధనుష్, సెల్వరాఘవన్ లా “నేనే వస్తున్నా” చిత్రం

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తన సోదరుడు మరియు విలక్షన దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో “నానే వరువేన్” చిత్రాన్ని చేసిన విషయం విదితమే. తాజాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటూ, విడుదలకు సిద్దమవుతుంది.

“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం ఇది.
యోగి బాబు, ఇందుజా రవిచంద్రన్ మరియు ఎల్లి అవ్రామ్ కూడా ఈ చిత్రంలో నటించారు.

కలై పులి ఎస్ తను నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ. “నానే వరువేన్” చిత్రం తెలుగులో “నేనే వస్తున్నా” పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ “గీతా ఆర్ట్స్” ప్రెసెంట్ చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించింది.ఈ సంధర్బంగా కలై పులి ఎస్ థాను, గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ ను కలిసారు. “నేనే వస్తున్నా” చిత్రం సెప్టెంబర్ నెలలోనే విడుదలకానుంది.

నటీనటులు:
ధనుష్, ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు మరియు యోగిబాబు

టెక్నికల్ టీమ్:
కథ: సెల్వరాఘవన్, ధనుష్
దర్శకుడు: సెల్వ రాఘవన్
నిర్మాత: కలై పులి ఎస్ థాను
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here