Home Entertainment Dark Side of Sultan Habeeb Ali’s AASRAA foundation

Dark Side of Sultan Habeeb Ali’s AASRAA foundation

0
17

స్వచ్చంధ సంస్థల పేరుతో అసాంఘీక కార్యకలాపాలు..
–పరపతి, హోదా మాటున వేధింపులు..
– హక్కులను పరిరక్షించాల్సిన వారే అఘాయిత్యాలకు నాంది

హైదరాబాద్‌ ; 14.09.2022: సామాజిక సేవలు, సామాజిక బాధ్యతలంటూ పలురకాల సంస్థలు, ఫౌండేషన్‌లు, అసోసియేషన్‌లు ఏర్పాటు చేయడం.., ఈ వేదికలను పలు అసాంఘీక కార్యకలాపాలను అడ్డాగా మార్చుకోవడం డబ్బు, పరపతి, హోదా ఉన్న కొందరికి పరిపాటిగా మారింది. ఇందులో భాగంగానే కన్సూ్యమర్‌ హక్కుల పరిరక్షణకు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘అస్రా’ (ఏఏఎస్‌ఆర్‌ఏఏ అడ్యకేట్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ అండ్‌ అవేర్‌నెస్‌) ఆర్గనైజేషన్‌ కూడా అసాంఘీక అరాచకాలకు వేదికగా మారింది. ఈ సంస్థలోని మహిళలకు పలుమార్లు వేదింపులకు గురైనప్పటికీ పలు కారణాల వల్ల అవి యబటకు రాలేదు. కానీ ఈ ఆర్గనైజేషన్‌లోని కీలక పదవిలో కొనసాగుతున్న మహిళ పైన జరిగిన వేధింపులు ఇప్పుడు పలు విమర్శలకు దారితీసింది.

‘అస్రా’ (ఏఏఎస్‌ఆర్‌ఏఏ అడ్యకేట్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ అండ్‌ అవేర్‌నెస్‌) ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన నగరంలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ వేదికగా నేషనల్‌ సమ్మిట్‌ నిర్వహించారు. ఈ సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన పార్టీలో సంస్థ ఫౌండర్‌ హబీబ్‌ సుల్తాన్‌ అలీ (హైకోర్ట్‌ అడ్వకేట్‌) అదే సంస్థలో ఒక వీలక సభ్యురాలైన మహిళతో హద్దులు దాటి అసభ్యంగా ప్రవర్తించం, వేధించడం భయబ్రాంతులకు గురిచేశారని సమాచారం. అతనితో పాటు మరో ప్రముఖ వ్యక్తి కలిసి ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఈ విషయం ఎవరితో చెప్పకూడదంటూ బ్లాక్‌మేయిల్‌ చేశారు. పార్టీలో భాగంగా అందించిన వైన్‌లో మత్తెక్కించే మరేదో మందు కలిపి శారీరకంగా వేదించే ప్రయత్నం చేశారని సంస్థకు సంబంధించిన వాట్సాప్‌ గ్రూప్‌లో ఆ మహిళ సమాచారాన్ని అందించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఫౌండర్‌ హబీబ్‌ సుల్తాన్‌ అలీ తన దగ్గరి మిత్రుడు కలిసి ఆ రాత్రి బయటకు వెళదాం, మనం వెళ్లినట్టు ఎవరికీ తెలియకూడదని ప్రోద్బలం చేశారని, ఆ సమయంలో అసభ్య పదజాలంతో మాట్లాడిన తీరు ఆమెను మాçనసికంగా వేధింపులకు గురిచేసింది. ఒక ఎన్‌జీవో ఫౌండర్‌ ఈ విధమైన కార్యకలాపాలకు నిర్వహిస్తుంటే సామాజికంగా వారి సేవలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. సంస్థ మీటింగ్స్‌ పేరుతో పార్టీలు ఏర్పాటు చేసి, హాజరైన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదు..! అంతే కాదు.. కన్సూ్యమర్‌ హక్కుల పరిరక్షణ పేరుతో పలురకాల మనీలాండరింగ్, బ్లాక్‌మేయిల్, వేధించడంలాంటి అసాంఘీక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ఆ సంస్థ సభ్యుల అభిప్రాయం. వారికున్న పరపతి, హోదా వల్ల ఎంతో మంది ఇందులో బాధితులుగా ఉన్నారు. క్లబ్‌లు, పబ్‌లలో జల్సాలు చేస్తూ, అమ్మాయిలతో లైంగిక వేదింపులకు గురి చేయడం, ఎదురుతిరిగితే భయబ్రాంతులకు గురిచేయడం మిగతా సభ్యులను కలవరానికి గురి చేసింది. అక్కడ అందించే కూల్‌డ్రింక్స్, వైన్‌లో కూడా మత్తు పదార్థాలువంటివి కలపడం నీచమైన పని. ప్రస్తుతం సంస్థ నేషనల్‌ సమ్మిట్‌లో భాగంగా ఆ మహిళ ఎదురుకొన్న సంఘటన ద్వారా ఆమెతో పాటు తన భరన్తు కూడా బ్లాక్‌మేయిల్‌ చేస్తూ వేధిస్తున్నారు. ఈ విషయం పైన సదరు మహిళ పోలీస్‌ శాఖలోని షీటీంలో కంప్లైంట్‌ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఘటనపైన న్యాయం కోసం తను ఎదుతిరిగినందుకు సంస్థ నుంచి తొలగించారని సమాచారం.

సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీల్లో ఫౌండర్‌ తప్పతాగి చిందులేయడం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం గతంలోనూ జరిగింది. దీనికి సంబంధించిన ఆధారాలు సోషల్‌మీడియా వేదికగా బహిర్గతం అయ్యాయి. ఈ సంఘటన పైన ప్రశ్నించిన పలువురు ఆస్రా సంస్థ సభ్యులకు కూడా వేధింపులు తప్పలేదు. స్వచ్చంధ సంస్థల పేరుతో నీచమైన పనులు చేయడం, వీటికి వారి డబ్బు, అధికారాలను ఉపయోగించడం క్షమించరాని నేరం. నేరాలు, అఘాయత్యాలు చేసిన వారిని చట్టపరంగా శిక్షించి, జైల్లో పెట్టాల్సిన వారే చికటిమాటున రాసలీలు జరపడం, మనీలాండరింగ్‌ చేయడం, వేధించడం హేయమైన చర్య. ఇందులో భాగంగా సామాజికంగా, మానసికంగా కృంగిపోయిన సామాన్యులు, మహిళలు ఎందరో. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్‌ నుంచి ముప్పు కొనసాగే ఉందని, అయినా పోలీసు, న్యాయ శాఖ వేదికగా తనకు కావాల్సిన న్యాయం కోసం పోరాడుతుంది. తన కోసమే కాదు.. మళ్లీ ఇలాంటి పరిణామాలు జరగకుండా, మరోకరికి ఇలాంటి వేధింపులు ఎదురుకాకూడదని ఆమె ప్రయత్నం.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here