లాంఛనంగా బాక్స్ బద్దలవుద్ది నినిమా ప్రారంభం…

చందన మూవీస్ బ్యానర్లో సీడీ నాగేంద్ర నిర్మాతగా, తల్లాడ సాయి క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “బాక్స్ బద్దలవుద్ది”. వివేకానంద విక్రాంత్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సుధాన్ కుమార, ప్రవీణ్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సినిమా సెప్టంబర్ 10న నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ పుట్టిన రోజు సందర్భంగా లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు.

నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రసన్న కుమార్ క్లాప్ కొట్టగా మరొక ప్రధాన కార్యదర్శి శ్రీ మోహన్ వడ్లపట్ల కెమెరా స్విచాన్ చేయగా, ఎస్ కుమార స్వామి మొదటి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం నిర్విరామంగా 35 రోజుల పాటు కొనసాగనుంది.

ఈ సంధర్భంగా దర్శకుడు తల్లాడ సాయి క్రిష్ణ మాట్లాడుతూ.., కరోనా అనంతరం సినిమా పరిశ్రమలో నెలకొన్న సంఘటనలు ప్రధానాంశంగా తీసుకుంటూ, ఒక ఫిల్మ్ మేకర్ కలను సినిమా రూపంలో చూపించబోతున్నాం. అలానే మూవీ మొఘల్ రామానాయుడు గారి ఆలోచన విధానంలో ఉన్న ఆర్కే నాయుడు అనే పాత్రలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నటించడం మా టీం కు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మా సినిమా ప్రారంభానికి విచ్చేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మట్లాడుతూ.., నిజ జీవితంలో నిర్మాతగా ఉన్న నన్ను ఈ సినిమాలో ముఖ్యమైన నిర్మాత పాత్రలో తెరపైకి తీసుకు వస్తున్న సినిమా బృందానికి శుభాభినందనలు తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ, కథనంతో పాటు సినిమా టైటిల్ సైతం నన్నెంతగానో ఆకట్టుకుందని అన్నారు.

సినిమాలో సినిమా తీయడమనే కాన్సెప్ట్ ఇప్పటికీ ఎవర్గ్రీన్, మా సినిమా ప్రారంభానికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలని సినిమా హీరో వివేకానంద్ విక్రాంత్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సుధాన్ కుమార్, పెరుమాళ్ళ ప్రవీణ్, సతీష్, చరణ్, శశి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here