Home Entertainment Producer Bekkam Venugopal Released Daksha Movie First Look

Producer Bekkam Venugopal Released Daksha Movie First Look

0
153

దక్ష చిత్రం మొదటి పోస్టర్ ను విడుదల చేసిన నిర్మాత బెక్కం వేణుగోపాల్

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై వివేకానంద విక్రాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తల్లాడ సాయి కృష్ణ నిర్మాతగా సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరో గా నటిస్తున్న సినిమా ” దక్ష”. ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ విడుదల చేశారు.

 

ఈ సందర్భంగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ “మన సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరో గా నటిస్తున్న చిత్రం దక్ష. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా చూడాలి అని అనిపిస్తుంది. ఈ సినిమాకు పని చేసిన నటి నటులు టెక్నిషన్స్ అంతా కొత్తవాళ్లే చాలా కష్టపడి పని చేశారు. ఈ చిత్రం థియేటర్  విడుదల అయ్యి మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు

నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ మా ఫస్ట్ లుక్ నచ్చి రిలీజ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన బెక్కం వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు అన్నారు.

డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ “వినాయక చవితి పండుగ సందర్భంగా మా దక్ష చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత బెల్లం వేణుగోపాల్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం, కథ కథనం చాలా కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నది, త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల చేస్తాం” అని తెలిపారు

నటి నటులు- ఆయుష్, అను, నక్షత్ర, రియా ,అఖిల్,రవి రెడ్డి , శోభన్ బాబు, పవన్.

నిర్మాత – తల్లాడ శ్రీనివాస్, తల్లాడ సాయి కృష్ణ
డైరెక్టర్ – వివేకానంద విక్రాంత్

కెమెరా- శివ రాథోడ్, ఆర్.ఎస్ శ్రీకాంత్,
రచన(రైటర్)- శివ కాకు,
సాహిత్యం – శరత్ చంద్ర తిరుగనూరి,
కొరియోగ్రాఫర్ – సాగర్
సంగీతం- శేఖర్
పి.ఆర్.ఓ – పవన్ పాల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్-అశోక్ నిమ్మల, గౌతమ్ ,విజయ్ నిట్టల

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here