బాల్రాజు… జులై 1న విడుదల

మణిబాల బ్యానర్ పై ఒలాద్రి బాలలక్ష్మి నిర్మాణంలో వెంకట్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ” బాల్రాజు ” . నిహాల్ నందన్ , అర్పిత లోహి హీరో, హీరొయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 1 న విడుదలకు సర్వం సిద్ధం అయినది. నిర్మాత సి.కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఆయన మాట్లాడుతూ… ట్రైలర్ చూస్తేనే సినిమా చూడాలనిపిస్తోంది. బాల్రాజు చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… ఈ చిత్రం మరో ” మృగం ” లా పెద్ద హిట్ అవుతుందని, ఈ చిత్రంలో నటించిన నిహాల్ నందన్, అర్పిత లోహి , A K మణి అద్భుతంగా నటించారు. ఈ చిత్రాన్ని నిర్మాత బాల లక్ష్మి ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు. నటి స్నిగ్ధ నయని మా సినిమాతో సంగీత దర్శకురాలిగా పరిచయం అవుతుంది , అధ్బుతమైన నేపధ్య సంగీతం సమకూర్చింది. మా కెమెరా మ్యాన్ రాకేష్ వర్మ కి ఇదే మొదటి సినిమా. అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు , మా ఎడిటర్ కళ్యాణ్ జలగం మంచి గ్రిప్పింగ్ తో ఎడిటింగ్ చేశాడు. అందరం కొత్తవాళ్ళం కలిసి మీ ముందుకు ఒక మంచి సినిమాని తీసుకొస్తున్నాం. జూలై 1న ధియేటర్ లో మా సినిమా ని చూసి మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here