సే నో టూ డ్రగ్స్…
– నగరంలో సందడి చేసిన దక్ష సినిమా బృందం..
– మారక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపు..
– కడబంస్ ఆధ్వరంలో వాకథాన్…
హైదరాబాద్: 26.06.2022:; నేషనల్ యాంటీ డ్రగ్స్ డే పురస్కరించుకుని దక్ష మూవీ టీం నగరంలో సందడి చేసింది. ఈ సంధర్భంగా దక్ష సినిమా బృందం సే నో డ్రగ్స్ అంటూ యువతకు పిలుపునిచ్చింది. గచ్చబౌలి లోని కడబంస్స్ సైకో సోషల్ రీహాబిలిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా వాకథాన్ నిర్వహించారు. ఈ వాకథాన్ లో దక్ష మూవీ టీం తో పాటు నర్సింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టూరిజం డెవల్మెంట్ శాఖ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ… ముఖ్యంగా యువత మారకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కట్టడి చర్యలను చేపట్టిందని అన్నారు.
నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ మత్తు పదార్థాలు ఇచ్చే కిక్కు కన్నా జీవితంలో సాధించే విజయాలు మరింత కిక్కుని ఇస్తాయని, మంచి భవిష్యత్తు కోసం యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని తల్లాడ సాయి క్రిష్ణ తెలిపారు. డ్రగ్స్ వాడే వారిలో అధిక శాతం యువకులే ఉన్నారని, సామాజికంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని సాయి క్రిష్ణ పేర్కొన్నారు.
దక్ష మూవీ డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ
యువత తలుచుకుంటే ఏదేన సాధించవచ్చు, మనం మంచి మార్గంలో ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో గచ్చబౌలి సీఐ సురేష్, ఎస్ ఐ రాధిక, దక్ష సినిమా బృందం వివేకానంద విక్రాంత్, అను, పవన్, కడబం ఛైర్మన్ డా. కడబం ఎం రమేష్, ఎం డి సందేశ్ ఆర్ కడబం, డా. రితిక, ఐఎంహెచ్ ఫని కాంత్, డైరెక్టర్ అనంత్ రాగ్, తదితరులు పాల్గొన్నారు.