ఎంగేజింగ్ రోడ్ థ్రిల్లర్… క‌ర‌ణ్ అర్జున్‌

రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో డా.సోమేశ్వ‌ర‌ రావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్ , రామకృష్ణ, క్రాంతి కిరణ్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం `క‌ర‌ణ్ అర్జున్‌`. అన్ని కార్యక్రమాలు పూ్తిచేసుకుని ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రోడ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏ మాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.

కథ: కరణ్ (నిఖిల్ కుమార్) తనకి కాబోయే భార్య వృషాలి (షిఫా)తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బోర్డర్ లో వున్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళతాడు. అక్కడ అర్జున్ (అభిమన్యు) వీళ్ళని ఇద్దరినీ వెంటాడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఒకానొక సమయంలో వీల్లిద్దరినీ వెంబడిస్తూ షూట్ చేసి చంపాలనుకుంటాడు అర్జున్. అర్జున్ నుంచి తప్పించుకోవడానికి ఎడారి ప్రాంతంలో నానా పాట్లు పడతారు కరణ్, వృషాలి. ఈ క్రమంలో అక్కడ స్థానికంగా ఉండే లారీ డ్రైవర్ అతనితో పాటు వుండే క్లీనర్ వృషాలిని ఎత్తుకుపోతారు. వారి బారి నుంచి వృశాలిని, అర్జున్ కాపాడుతాడు. చంపాలనుకున్న వృషాలీని అర్జున్ ఎందుకు కాపాడాడు? వృషాలినీ లారీ డ్రైవర్లు ఎత్తుకు పోతుంటే కరణ్ ఏమి చేస్తున్నాడు? అసలు వీరి ముగ్గురి మధ్య వున్న రిలేషన్ ఏంటి? చివరకు క్లైమాక్స్ లో ఏమి తేలింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…!!!

కథ… కథనం విశ్లేషణ: గుప్పెడంత మనసుకి సముద్రమంత గాయం అయితే…. చివరకు ప్రాణాలు తీసే అంత క్రూరత్వం పనికి రాదు అని దర్శకుడు మోహన్ శ్రీవత్స చెప్పిన నీతి సూత్రం బాగుంది. ఒకరు అమ్మ మీద వున్న అమితమైన ప్రేమతో…. మరొకరు అమ్మాయి మీద వున్న ఘాడ ప్రేమతో… ప్రాణాలు తీసేదాకా వెళ్ళడం మంచిది కాదని దర్శకుడు చాలా థ్రిల్లంగ్ ఎలిమెంట్స్ తో చెప్పారు. మొదట్లో సినిమా టేక్ ఆఫ్ కావడానికి కొంత సమయం తీసుకున్నా… ఇంటర్వల్ బ్యాంగ్ నుంచి క్లైమాక్స్ దాకా ఆసక్తికరమైన ట్విస్టులతో కథ… కథనాలను నడిపించాడు దర్శకుడు. కొంచం స్టార్ కాస్ట్ వుండి వుంటే సినిమాకి అదనపు బలం చేకూరేది.

నిఖిల్ కుమార్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో చక్కగా నటించాడు. తల్లిని అమితంగా ప్రేమించే కరణ్ పాత్రకు బాగా సూట్ అయ్యాడు. అభిమన్యు కూడా టూ షేడ్స్ లో మెప్పించాడు. తన ప్రియురాలిని గాఢంగా ప్రేమించే అర్జున్ గానూ…. సోషియల్ కాజ్ కోసం పనిచేసే బాధ్యత గల యువకునిగా ఆకట్టుకుంటాడు. అలానే హీరోయిన్ షిఫా కూడా తన పాత్రకు న్యాయం చేసింది. తల్లి పాత్రలో నటించిన సునీత చౌదరి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి తన పాత్ర పరిధి మేరకు నటించింది. మిగతా పాత్రన్నీ ఓకే.

నేపథ్య సంగీతం బాగుంది. సురేష్ గంగుల రాసిన సాంగ్స్ బాగున్నాయి. రాజస్థాన్ లోకేషన్స్ ని సినిమాటోగ్రాఫర్ బాగా చూపించారు. ఎడారిలో చేజింగ్ సీక్వెన్స్ బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా వుంది. ఓవరాల్ గా… రోడ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కరణ్ అర్జున్… మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకలను రెండు గంటల పాటు కూర్చునేలా బాగా ఎంగేజ్ చేస్తుంది. గో అండ్ వాచ్ ఇట్…!!!

రేటింగ్: 3

నటీ నటులు:
అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా, మాస్ట‌ర్ సునీత్, అనితా చౌదరి, రఘు.జి, జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్న త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
నిర్మాతలు: డా. సోమేశ్వ‌ర‌రావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి మేకల
కథ -మాటలు -స్క్రీన్ ప్లే- ద‌ర్శ‌క‌త్వం: మోహన్ శ్రీవత్స
ఫైట్స్: రామ్ సుంకర
ఎడిటర్: కిషోర్ బాబు
కాస్ట్యూమ్ డిజైనర్: లతా మోహన్
మ్యూజిక్: రోషన్ సాలూర్
పాట‌లుః సురేష్ గంగుల‌
కొరియోగ్రఫీ: రవి మేకల
డి .ఓ .పి: మురళి కృష్ణ వర్మన్;
పిఆర్. ఓ: చందు ర‌మేష్ (బాక్సాఫీస్)
డిజైనర్: వీవా పోస్టర్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here