కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న “బ్లాక్” చిత్రం గొప్ప విజయం సాదించాలి..”బ్లాక్” ప్రి-రిలీజ్ ఈవెంట్ లో యం..యల్.ఏ లు సుభాష్ రెడ్డి, గణేష్ గుప్త

మహంకాళి మూవీస్ పతాకంపై అది సాయి కుమార్ హీరో గా ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కౌషల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ నటీనటులు గా జి బి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం “బ్లాక్”.  ఇప్పటికె విడుదలైన టీజర్,ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నెల 28న గ్రాండ్ గా విడుదల చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ కార్యక్రమం సినీ,రాజకీయ నాయకుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి యం..యల్.ఏ. సుభాష్ రెడ్డి,యం యల్ ఏ.గణేష్ గుప్త ,యం యల్ సి.దయానంద్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ దామోదర్ గుప్తా, శ్రీని ఇన్ఫ్రా శ్రీనివాస్, ఆర్.వి.జగదీష్ రావు, హీరోయిన్ స్నేహనూర్, సెవెన్ ఆర్ట్స్ సతీష్, వెంకటేశ్వర రెడ్డి, సి.ఐ. పార్థసారథి రెడ్డి, నిర్మాత రామ సత్యనారాయణ,హీరో విజయ్ శంకర్,రైట్ మూవీ డైరెక్టర్ రవి శంకర్, తాళ్లాడ వెంకన్న, విట్ఠల్, నిర్మాత మన్మధ రావు , విబిజి రాజు, తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

యం..యల్.ఏ. సుభాష్ రెడ్డి, మాట్లాడుతూ..మహంకాళి మూవీస్ పతాకంపై  మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శక, నిర్మాతకు ధన్యవాదాలు.ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

యం..యల్.ఏ.గణేష్ గుప్త మాట్లాడుతూ..ఎంతో మందికి వాయిస్ ఇచ్చిన నటుడు సాయికుమార్ తనయుడు అది హీరో గా చేస్తున్న ఈ సినిమాను జి బి కృష్ణ దర్శకత్వంలో నా మిత్రుడు దివాకర్ నిర్మిస్తున్న ఈ చిత్ర, ట్రైలర్, టీజర్ చాలా బాగున్నాయి. ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

యం యల్ సి.దయానంద్ మాట్లాడుతూ.. ఆది తో దివాకర్ చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

చిత్ర హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ..”బ్లాక్” అనే సినిమా కొత్త కొన్సెప్టు సినిమా..మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని దర్శక, నిర్మాతలు ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా  మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది అన్నారు.

నటుడు కౌశల్ మాట్లాడుతూ.. ఒక మనిషి కళ్ళు మూసుకుంటే అంతా “బ్లాకే”..ఈ “బ్లాక్” సినిమా వెరీ డీఫ్రెంట్ థ్రిల్లర్ ఫిల్మ్..అది కి తన కెరీర్ లో ది బెస్ట్ సినిమా అవుతుంది.దర్శకుడు పూరి దగ్గర వర్క్ చేసిన ఈ చిత్ర దర్శకుడు చక్కని కథను రెడీ చేసుకొన్నాడు. తనతో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.నిర్మాత దివాకర్ గారు సంజీవినీ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో సోషల్ యాక్టీవ్ టీస్ చేస్తుంటాడు.నా ఫౌండేషన్ ద్వారా పదిహేను వేల మందికి బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది.మా ఇద్దరికీ అలా కనెక్ట్ అవ్వడం జరిగింది.దివాకర్ లాంటి మంచి మనసున్న వ్యక్తితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

చిత్ర దర్శకుడు జి బి కృష్ణ మాట్లాడుతూ..మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.డిఫరెంట్ కాన్సెప్ట్ తో మే 28న ప్రేక్షకుల ముందుకు “బ్లాక్” చిత్రం విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.నన్ను ఎంకరేజ్ చేస్తూ నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబెర్స్,కు ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. నేను పూరి సర్ దగ్గర వర్క్ చేయడానికి వెళ్ళినపుడు తన దగ్గర కొన్ని అవుట్ ఫుట్స్ నేర్చుకున్నాను.అవి ఈ సినిమాస్కు ఎంతో ఉపయోగపడ్డాయి.బిగ్ బాస్ తర్వాత కౌశల్ గారు తమిళ్ సినిమాకు  సోలో హీరో గా వెళ్ళడానికి అంతా రెడీ అయిన తరువాత నేను ఈసినిమా స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. తనకు ఎడ్ కాన్సెప్ట్ నచ్చడంతో సోలోగా చేసే సినిమాను హోల్డ్ లో పెట్టి ఈ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చిన తనకు ధన్యవాదాలు. ఈ బ్లాక్ చిత్రం కోవిడ్ టైం లో స్టార్ట్ అయినా నిర్మాత దివాకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.హీరో ఆది గారిని ఇప్పటి వరకు మీరు చూసిన ఆది గారు ఒక ఎత్తైతే ఇప్పుడు చూసే ఆది గారు డీఫ్రెంట్ అటెంప్ట్ తో డీఫ్రెంట్ కాన్సెప్ట్ తో రావడం ఒక ఎత్తు. ఆది గారు ఎంతమంచి ఫైటరో, ఎంతమంచి డ్యాన్సరో మనందరికీ తెలుసు ఈ సినిమాలో ఒకే ఒక్క పాట మాత్రమే ఉంటుంది.హెవీ ఫైట్స్ ఉండవు.కంటెంట్ మీదే సినిమా నడుస్తుంది.ఇందులో తన నటన, కథ, కథనం ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. ఆడియన్స్ కి సరికొత్త చిత్రాన్ని అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడు మాత్రం కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు అని అన్నారు.

నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ..మా ప్రి రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.ఈ సినిమా ను మేము రెండు సంవత్సరాలుగా గా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశాము. డీఫ్రెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం మా బ్యానర్ కు ఒక మైలు రాయిగా నిలుస్తుంది. అలాగే అది గారికి ఈ సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. కౌశల్ ఇందులో చాలా చక్కని పాత్ర చేశాడు.ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే ఆయన నెక్స్ట్ హీరో గా చేయబోయే సినిమాకు ఈ సినిమా క్యారెక్టర్ ట్రైలర్ లా ఉంటుంది. దర్శకుడు కృష్ణ  చాలా చక్కటి కథను తెరకెక్కించడం జరిగింది.మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “మా బ్లాక్ చిత్రం మే 28న విడుదల అవుతున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

నిర్మాత సెవెన్ ఆర్ట్స్ సతీష్ మాట్లాడుతూ..,దర్శక, నిర్మాతలు మంచి సబ్జెక్టు తీసుకొని సినిమా తీస్తున్నారు. అలాగే హీరో ఆది చాలా కష్టపడతాడు తనకు ఒక్క హిట్ పడితే మాస్ హీరో అవుతాడు.తనతో పాటు ఈ సినిమాకు పని చేసిన 24 క్రాఫ్ట్స్ అందరికీ ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

ఆర్.వి.జగదీష్ రావు మాట్లాడుతూ..దివాకర్ గారు ఇలాగే మంచి కాన్సెప్ట్ ఉన్నటు వంటివి వంద సినిమాలు తీయాలి అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

నటీనటులు
అది సాయి కుమార్, ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కౌషల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాత : మహంకాళి దివాకర్
రచన – దర్శకత్వం : జి బి  కృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శంకర్
సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్ : అమర్ రెడ్డి
ఫైట్స్ : రామకృష్ణ
ఆర్ట్ : కె వి రమణ
పి ఆర్ ఓ : పాల్ పవన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here