ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఆటో రజనీ మూవీ టీమ్

శ్రీ మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ హరికృష్ణ, మోక్ష జంటగా శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో నిర్మిస్తున్న హై ఓల్టేజ్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆటో రజిని.

 

గురువారం సాయంత్రం చిత్ర యూనిట్ ఏపి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ గారినీ ఎంపి నందిగాం సురేష్ అధ్వర్యంలో కలసి మూవీ లోని కొన్ని సన్నివేశాలను చూపించి చిత్ర విశేషాలను వివరించి అయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ చిత్రం లో ఎంపి నందిగాం సురేష్ కూడా ఓ కీలక పాత్రలో నటించడం విశేషం.

ఈ సినిమా కి సంబంధించి ఇటీవల ఓభారీ యక్షన్ షెడ్యుల్ ను విజయవాడ లో జరిపారు .ఈ షెడ్యుల్ లో బాపట్ల ఎంపి గౌరవ నందిగాం సురేష్…. హీరో హరి జొన్నలగడ్డ కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అధ్వర్యంలో 150మంది డాన్సర్ లతో ఓ పాటను చిత్రీకరించారు. జూన్ 10 నుంచి మరొక షెడ్యుల్ ను విజయవాడ లో జరుపనున్నారు జూలై 10 నుంచి క్లయిమ్యాక్స్ సన్నివేశాలను నెల్లూరు కృష్ణ పట్నం పోర్ట్ లో జరుపుతారు

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ జొన్నలగడ్డ మాట్లాడుతూ: మా ఆటోరజినీ సినిమా షూటింగ్ కి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ఏపి ప్రభుత్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఏపి సిఎం జగన్ గారిని కలసి అయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. సినిమా షూటింగ్ లకు ఏపి అనువైన ప్రదేశం. మంచి లోకేషన్స్ వున్నాయి. మా షూటింగ్ కి ఎక్కడ చిన్న అవాంతరం లేకుండా ఏపి ప్రభుత్వం సహకరించింది అందుకు జగన్ గారినీ కలసి కృతజ్ఞతలు తెలిపాము. అలాగే నా మీద నమ్మకంతో మా హిరో హరి మీద అభిమానంతో ఈ సినిమా లో గౌరవ ఎంపి శ్రీ నందిగాం సురేష్ అన్న ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఇటీవల ఓ భారీ షెడ్యుల్ ను విజయవాడ లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర గౌరవ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్య సాధన దీక్ష చేసిన ప్రాంతంలో జరిపాము. ఈ షెడ్యుల్ లో కొన్ని ముఖ్య సన్నివేశాలతో పాటు ఎంపి నందిగాం సురేష్ అన్న హిరో హరి కాంబినేషన్ లో వచ్చే హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ను ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ నేతృత్వంలో షూట్ చేసాము. ఎంపి నందిగాం సురేష్ అన్న అద్భుతంగా నటిస్తున్నారు. మొదటి సినిమా నే అయిన ఎంతో మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ లాగా నటిస్తున్నారు డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ఫైట్ సీక్వెన్స్ సినిమా కి హైలెట్ గా వుంటుంది. అలాగే హిరో హరి ఇంటర్డిక్షన్ డైలాగ్స్ బాగా వచ్చాయి. షూటింగ్ కి సంబంధించి ప్రభుత్వ అధికారులు, పోలీస్ వారు ఎంతో సహకరించారు. ముఖ్యంగా వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి అన్న, ఎమ్మెల్యే కొడాలి నాని అన్న ఎమ్మెల్సీ తలశిల రఘురాం అన్న సహకారం మరువలేనిది. మాకు సహకరించిన ప్రభుత్వ అధికారులకు పోలీస్ శాఖ వారికి జీ వి ఎమ్ సి వారికి థాంక్స్. తదుపరి షెడ్యుల్ ను జూన్ 10 నుంచి విజయవాడ కో ప్రారంభిస్తాము జూలై 10 నుంచి నెల్లూరు కృష్ణపట్నంలో క్లయిమ్యాక్స్ సన్నివేశాలను షూట్ చేస్తాము.ఇప్పటివరకు 50 పర్సెంట్ సినిమా టాకీ పార్ట్ పూర్తి అయ్యింది అని అన్నారు

నటీనటులు :
జొన్నలగడ్డ హరికృష్ణ , మోక్ష (తొలి పరిచయం) తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : శ్రీ మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్
సినిమా పేరు : ఆటో రజిని
మ్యూజిక్ : మణిశర్మ
కెమెరా: ప్రసాద్ బాబు
ఎడిటింగ్ : గౌతం రాజు
డాన్స్ : ప్రేమ్ రక్షిత్
ఫైట్స్ : కనల్ కన్నన్
ఆర్ట్ : చిన్న
కథ : విక్రమ్ రాజా
పబ్లిసిటీ : సురేష్ అంజన్
కో డైరెక్టర్ : శ్రీనివాస రెడ్డి
స్క్రీన్ ప్లే దర్శకత్వం : శ్రీనివాస్ జొన్నలగడ్డ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here