పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ” దక్ష ” సినిమా

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా నటిస్తున్న సినిమా ” దక్ష “.

తల్లాడ శ్రీనివాస్ నిర్మాత గా వివేకానంద విక్రాంత్ డైరెక్టర్ గా చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ సందర్భంగా డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ
మేము అనుకున్న విధంగా సినిమా షూట్ చేసాం, తనికెళ్ళ భరణి గారు, శరత్ బాబు గారి సపోర్ట్ తో ఇటివల టైటిల్ లాంచ్ చేసి మీ అందరి మన్ననల్ని పొందాము,
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి,
త్రిల్లర్ జోనర్ గా డిఫరెంట్ థీమ్ తో తెరకెక్కుతుంది అన్నారు.

కో ప్రొడ్యూసర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ ఇటీవల కాలంలో త్రిల్లర్ జోనర్స్ కథలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, అలాంటి తరహాలోనే మా సినిమా సిద్ధం అవుతుంది.

హీరో ఆయుష్ మాట్లాడుతూ
నేను చేస్తున్న మొదటి సినిమా ఇది అవ్వడం వలన అన్ని తెలుసుకుంటూ , అవుట్ ఫుట్ బాగా రావడానికి నా వంతు నేను కృషి చేస్తున్నాను, డబ్బింగ్ చెప్పినప్పుడు అర్థం ఐనది
నిజమైన నటుడు , నటన విలువ ఈ డబ్బింగ్ లో అర్థం అవుతోంది అని, మా డైరెక్టర్ విక్కీ మాత్రం ఎక్కడ రాజీ పడకుండా సినిమా ని పూర్తి చేస్తున్నాడు అని అన్నారు.

రవి రెడ్డి, శోభన్, అను, నక్షత్ర, రియా, అఖిల్, పవన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కి సిద్ధంగా ఉంది.

సినిమా పేరు – దక్ష
బ్యానర్ – శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్
ప్రొడ్యూసర్- తల్లాడ శ్రీనివాస్
డైరెక్టర్- వివేకానంద విక్రాంత్
కో ప్రొడ్యూసర్- తల్లాడ సాయికృష్ణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here