మాటరాని మౌనమిది గ్లింప్స్  టీజర్ విడుదల

సుకు పూర్వాజ్(suku purvaj), దర్శకుడు గత సంవత్సరం శుక్ర సినిమా తో మంచి పైసా వసూల్ విజయం అందుకున్నాడు. థియేటర్ లో విడుదలై మంచి సినిమా గా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం శుక్ర సినిమా ని అమెజాన్ ప్రైమ్ లో 22 లక్షల మంది వీక్షించి దర్శకుడికి గొప్ప విజయం అందించారు మన తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు మరో అందమైన కథ తో సుకు పూర్వాజ్ మన ముందుకు వస్తున్నాడు.

రుద్ర పిక్చర్స్ పతాకంపై మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి హీరో హీరోయిన్ గా సుకు పూర్వాజ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “మాటరాని మౌనమిది”. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో నిమగ్నమై ఉంది. అయితే ఈ చిత్రం యొక్క గ్లింప్స్  టీజర్ (Glimpse Teaser) ను విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ “నా మొదటి సినిమా శుక్ర, మంచి విజయం సాధించింది. అమెజాన్ ప్రైమ్ లో 2.2 మిలియన్ మంది వీక్షించారు. ఇప్పుడు “మాటరాని మౌనమిది” అనే మంచి థ్రిల్లర్ ప్రేమ కథ తో మీ ముందుకు వస్తున్నాను. మంచి కథ, కథనం తో ఎం ముందుకు వస్తున్నాను. ఈ చిత్రం లో మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు మరియు శ్రీహరి ఉదయగిరి, సంజీవ్, అర్చన అనంత్, కేశవ్, సుమన్ శెట్టి ప్రధాన పాత్రలు  పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అషీర్ లుక్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు మరియు శివరామ్ చరణ్ కెమెరా మాన్ గా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు.

బ్యానర్ : రుద్ర పిక్చర్స్

సినిమా పేరు : మాటరాని మౌనమిది

నటి నటులు : మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి, సంజీవ్, అర్చన అనంత్, కేశవ్, కాశి, ప్రమోద్, చందు సుమన్ శెట్టి, తదితరులు

కెమెరా మాన్ : శివరామ్ చరణ్

సంగీతం : అషీర్ లుక్

ఎడిటర్ : శివ సర్వాణి

కథ, కధనం, దర్శకత్వం : సుకు పూర్వాజ్

నిర్మాత : రుద్ర పిక్చర్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here