ఆది సాయి కుమార్ నటించిన బ్లాక్ చిత్రం ఏప్రిల్ 22న విడుదల

మహంకాళి మూవీస్ పతాకంపై అది సాయి కుమార్ హీరో గా జి బి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం “బ్లాక్”. ఈ చిత్రం లో ఆది క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. తన కెరీర్ లో బ్లాక్ చిత్రం ఒక స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది. ఇటీవల విడుదల అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా దర్శకుడు జి బి కృష్ణ మాట్లాడుతూ “బ్లాక్ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఆది గారి నటన, కథ, కథనం ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. మా నిర్మాత మహంకాళి దివాకర్ గారు రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మా చిత్రం ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో ట్రైలర్ ను విడుదల చేసి ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేస్తాం” అని తెలిపారు.

నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ “మా బ్లాక్ చిత్రం ఏప్రిల్ 22న విడుదల అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. మంచి కథ, కథనం తో చిత్రాన్ని నిర్మించాము. మా దర్శకుడు జి బి కృష్ణ మంచి చిత్రాన్ని అందించాడు. సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం ఉంది” అని తెలిపారు.

ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కౌషల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలో  నటిస్తున్నారు.

ఈ చిత్రానికి

సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్ : అమర్ రెడ్డి
ఫైట్స్ : రామకృష్ణ
ఆర్ట్ : కె వి రమణ
పి ఆర్ ఓ : పాల్ పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శంకర్
నిర్మాత : మహంకాళి దివాకర్
రచన – దర్శకత్వం : జి బి  కృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here