Home Entertainment Velipo Music Video Launched

Velipo Music Video Launched

0
225

వాలెంటైన్స్ డే సందర్భంగా వెళ్ళిపో మ్యూజిక్ వీడియో రిలీజ్, ట్రేండింగ్

ప్రముఖ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రిత నాయుడు రాకీ జార్డన్ జంటగా, నరేష్ అమనేని డైరెక్షన్ లో రూపొందిన “వెళ్ళిపో” మ్యూజిక్ వీడియో ను ప్రేమికుల రోజున రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో సురేఖ వాణి, రాకీ జార్డన్, సుప్రీత నాయుడు, డైరెక్టర్ నరేష్ అమరనేని , సినిమాటోగ్రాఫర్ రవి, సాయి యశ్వంత్ , శ్యామ్
వాడవల్లి, సుర్య సుబ్రహ్మణ్యం, గురు స్వామి తదితరులు పాల్గొన్నారు

డైరెక్టర్ నరేష్ అమరనేని మాట్లాడుతూ; రాకీ నా దగ్గర కొచ్చి సాంగ్ చూపించి డైరెక్ట్ చేయమన్నప్పుడు రెగ్యులర్ గా కాకుండా ఈ మధ్య కొత్తగా హాలీవుడ్, బాలీవుడ్ ల లో వస్తున్న విధంగా మ్యూజిక్ వీడియో లా చేద్దామని కాన్సెప్ట్ ను రాకీ కి చెప్పాను, అతనికి నచ్చి వెంటనే స్టార్ట్ చేసాము.నా మీద నమ్మకంతో ఈ మ్యూజిక్ వీడియో నీ నాతో చేయించిన రాకీ కి థాంక్స్ .ఇక హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్న టైం లో సురేఖ వాణి గారి అమ్మాయి గురించి ఒక ఫ్రెండ్ చెప్పారు నేను కొడైరెక్టర్ గా చేసిన కొన్ని సినిమాల్లో సురేఖ వాణి గారు నటించారు, ఆ పరిచయంతో వెళ్లి అడిగాను ముందు ఒప్పుకోలేదు తరువాత నా మీద నమ్మకంతో ఓప్పుకున్నారు. ఇక సుప్రిత నేను యాక్టింగ్ చేయలేను అని చెప్పేది కాని నేను చేయించుకుంటాను అనేవాడిని ఆమె క్యారెక్టర్ ని ఒన్ చేసుకొని చాలా ఈజీ గా చేసింది ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించింది, డి ఓ పి రవి చాలా హార్డ్ వర్క్ చేశాడు, చెప్పిన విషయాన్ని ఓపికగా విని అర్ధం చేసుకొని మంచి అవుట్ పుట్ ఇచ్చాడు, ఫాస్ట్ కెమెరా మెన్. ప్రతి ఫ్రేం నీ రిచ్ గా క్యూట్ గా తీర్చి దిద్దాడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగా చూసుకున్నాడు ఎడిటర్ శ్యామ్ వాడవల్లి 20 సంవత్సరాలనుంచీ నాకు ఫ్రెండ్ అవటంతో మంచి సపోర్ట్ ఇచ్చాడు. ప్రొడ్యూసర్స్ రాకీ ఫ్రెండ్స్. వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత అందంగా వచ్చింది, టీమ్ సపోర్ట్ మరువలేను ఈ మ్యూజిక్ వీడియో కి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అని అన్నారు

సుప్రీత నాయుడు మాట్లాడుతూ: వెళ్ళిపో మ్యూజిక్ వీడియో చేసిన తరువాత ఇది నేనేనా చేసింది అనిపించింది.ఎందుకంటే నేను చేయలేను, చేయలేను అంటున్న నువ్వు చేయగలవు అంటు ఎంతో ఓపికతో నన్ను యాక్ట్ చేయించారు డైరెక్టర్ నరేష్ గారు. డి ఓ పి రవి నన్ను చాలా బ్యూటీ గా చూపించారు. ఈ ప్రాజెక్ట్ తో నాకొక మంచిఫ్రెండ్ దొరికాడు అతనే రాకీ .నరేష్ గారి తరువాత నేను చేయగలను అని ఎంతో సపోర్ట్ గా నిలిచాడు ఈ రోజు మా ఫాదర్ వుంటే ఎంతో హ్యాపీగా ఫీలయ్యే వారు అని అన్నారు

రాకీ జార్డన్ మాట్లాడుతూ: మా ఫ్రెండ్స్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు, నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా “వెళ్ళిపో” లాంటి మ్యూజిక్ వీడియో లు చేయాలని, హాలీవుడ్ బాలీవుడ్ తరహాలో వస్తున్నట్టు సౌత్ లో కూడా తెలుగు లో చేయాలని నాకోరిక .అది నెరవేరిననందుకు హ్యాపీ గా వుంది ఇక మా డైరెక్టర్ నరేష్ అన్న గురించి చెప్పాలి అంటే నాకు అన్ని తానే. అయన గురించి ఎంత చెప్పినా తక్కువే.చాలా ఓపికగా చూసుకున్నారు. మ్యూజిక్ వీడియో ఇంత బాగా రావడానికి డీ ఓ పి రవి గారు హార్డ్ వర్క్.ఒక మంచి ప్రయత్నం చేసాము. అందరూ చూసి మా ప్రయత్నాన్ని bless చెయ్యండి అన్నారు

నటి సురేఖ వాణి మాట్లాడుతూ; ఈ ప్రాజెక్ట్ లో మా అమ్మాయిని ఇన్వాల్వ్ చేయడానికి డైరెక్టర్ నరేష్ మీద ఉన్న నమ్మకం. మొదట వద్దు అనుకున్నాం అయితే నరేష్ నేను చేయించుకోగలను అని చెప్పడం, కాన్సెప్ట్ నచ్చడం తో సుప్రీత యాక్ట్ చేసింది. ఈ మ్యూజిక్ వీడియో ఇంత అందంగా బాగా రావడానికి కారణం నరేష్ హార్డ్ వర్క్ రాకీ బాగా చేసాడు డీ ఓ పి రవి ప్రతి ఫ్రేమ్ నీ బాగా చూపించారు అని అన్నారు.

నిర్మాత: బ్యాచిలర్ కొంప ప్రొడక్షన్స్
కాన్సెప్ట్, డైలాగ్స్, డైరెక్షన్: నరేష్ అమరనేని
స్టారింగ్: రాకీ జార్డన్, సుప్రిత నాయుడు
మ్యూజిక్: తేజా కునూరు
సింగర్: రేవంత్
లిరిక్స్: రాకీ జార్డన్
డి ఓ పి: రవి బోయిడపు
ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి యశ్వంత్ గల్లా
లైన్ ప్రొడ్యూసర్; సూర్య సుబ్రమణ్యం

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here