*శ్రీమాన్ త్రిదండి చిన జీయర్ స్వామి చేతుల మీదుగా లక్ష్మణ్ మురారి టీమ్ రూపొందించిన “సమతా స్ఫూర్తి” ఆధ్యాత్మిక గీతం విడుదల*

శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా అత్యంత వైభవోపేతంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న 216 అడుగుల ఎత్తయిన శ్రీ రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి MLA గారి నిర్వహణలో,
కాకతీయ ఇన్నోవేటివ్ అధినేతలు లక్ష్మణ్ మురారి & రమేష్ గార్ల ఆధ్వర్యంలో రూపొందించబడిన *శ్రీరామనుజం సమతస్ఫూర్తి* అనే ప్రత్యేక ఆధ్యాత్మిక గీతాన్ని ప్రముఖ శాస్త్రీయ, సినీ సంగీత దర్శకులు గాయకులు నిహాల్ కొండూరి గారు సంగీత దర్శకత్వం వహించి ఆలపించగా, కృష్ణవేణి మల్లావజ్జలగారు రచించడం జరిగింది.

ఈ ప్రత్యేక గీతాన్ని *శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామీజీ వారు ఆవిష్కరించి,టీమ్ ను అభినందించారు.*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here