దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదలైన “గంధర్వ” చిత్రంలోని లిరికల్ ప్రోమో సాంగ్

 

 

యస్ అండ్ యమ్ క్రియేషన్స్, వీరశంకర్ సిల్వర్ స్క్రీన్  పతాకాలపై వంగవీటి, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకొని ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్.సురేష్, అక్షత శ్రీనివాస్ హీరోయిన్స్ గా అప్సర్ దర్శకత్వంలో యం యన్ మధు నిర్మిస్తున్న చిత్రం “గంధర్వ”. ఈ చిత్రం లోని లిరికల్ ప్రోమో సాంగ్ ను ప్రముఖ దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు

 

 

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన  దర్శకుడు బాబీ మాట్లాడుతూ .. ఈ కొత్త సంవత్సరములో గంధర్వ సాంగ్ ప్రోమోను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.  శాండీ అండ్ ఈ చిత్ర టీం మరియు దర్శకుడు నాకు మంచి ఫ్రెండ్స్, దర్శకుడి ద్వారా విన్న ఈ సినిమా లైన్ చాలా బాగుంది. ఆర్మీ నుండి స్టార్ట్ అయి ప్రజెంట్ జనరేషన్ దాకా ట్రాన్స్ఫర్మేషన్ ను, ఫ్యామిలీని, సొసైటీని ఇందులో మలచడం చాలా పెద్ద టాస్క్. ఇలాంటి మంచి సబ్జెక్ట్ తో వస్తున్న ఈ చిత్ర యూనిట్ కష్టం ఎక్కడికి పోదు .ర్యాప్ ర్యాప్ షకీల్ అందించిన ఈ పాట చాలా బాగుంది. తెలుగు ఇండస్ట్రీకు అప్సర, నాగు గార్లు మంచి చిత్రాన్ని ఇవ్వబోతున్నారు. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న  టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు

 

 

చిత్ర దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ .ఈ సినిమాకు. ర్యాప్ ర్యాప్ షకీల్ అందించిన సంగీతం ప్రత్యేకంగా ఉంటుంది. ఫీచర్లో తను మంచి సంగీత దర్శకుడు అవుతారు. సందీప్ మాధవ్ యాక్షన్ ప్యాక్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం వంగవీటి, జార్జి రెడ్డి సినిమాలలో చూశాము. కొత్త కమర్షియల్ యాంగిల్ లో సందీప్ ను ఈ సినిమాలో చూడబోతున్నాము.పిలిచిన వెంటనే బాబీ గారు వచ్చి మా చిత్రంలో సాంగ్ ను విడుదల చేసినందుకు వారికి మా ధన్యవాదాలు. ,అలాగే. జవహర్ రెడ్డి గారు సందీప్ ను  చాలా అందంగా  చూపించారు ఈ సినిమాలో.. నటీనటులు, టెక్నిసిషన్స్ ఇలా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు.  నాగు గారు మా అందరికీ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతున్న ఈ పాట ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అన్నారు

 

 

హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. వంగవీటి, జార్జిరెడ్డి సినిమాల తర్వాత చేస్తున్న సినిమా “గంధర్వ” అఫ్సర్ గారు చెప్పిన ఈ లైన్ చాలా కొత్తగా ఉంది. తెలుగులో మేము ఈ సినిమా ద్వారా కొత్త ప్రయత్నం చేస్తున్నాము. ఫస్ట్ నేను టైం బయోపిక్ కాకుండా కమర్షియల్ సినిమాలో హీరోగా చేస్తున్నాను. ఈ సినిమాలో నేను మొదటి సారి డ్యాన్స్ కూడా చేయడం జరిగింది. సంగీత దర్శకుడు ర్యాప్ ర్యాప్ షకీల్ ఇచ్చిన ఈ పాటను దర్శకుడు బాబి గారు విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.దర్శకుడు అప్సర గారు సినిమాను చాలా బాగా తీశారు. జవహర్ రెడ్డి గారు ఈ సినిమాలో నన్ను ఆయన ఫోటోగ్రఫీ ద్వారా చాలా అందంగా చూపించారు. నాగు గారు ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా ఉండి మా అందరికీ ఎంతో సపోర్ట్ గా నిలిచారు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతున్న ఈ పాట ప్రేక్షకులందరికీ తప్పకుండా వస్తుందని అన్నారు

 

 

సంగీత దర్శకుడు ర్యాప్ ర్యాప్ షకీల్  మాట్లాడుతూ.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం రోజున మా” “గంధర్వ” మూవీ లోని పెప్పే సాంగ్ ను దర్శకుడు బాబి గారు చేతుల మీదుగా విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులోని పెప్పే సాంగ్  విన్న ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు.ఈ సినిమా ఒక కొత్త ఫార్మాట్ లో ప్రేక్షకులను అలరించబోతున్న  ఇలాంటి మంచి చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

 

 

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

 

 

నటీనటులు: సందీప్ మాధవ్, గాయత్రి ఆర్.సురేష్, శీతల భట్, సాయి కుమార్, సురేష్, పోసాని, బాబు మోహన్, తాగుబోతు రమేష్,  సత్య శ్రీ,  రాంప్రసాద్, ఆర్జీవి రాము, పింగ్ పాంగ్ సూర్య తదితరులు
సాంకేతిక నిపుణులు: నిర్మాత; యమ్ యన్. మధు, లైన్ ప్రొడ్యూసర్; పాతూరి శ్రీకాంత్ రెడ్డి, కధ-స్క్రీన్-ప్లే- దర్శకత్వం; అప్సర్, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై. నాగు,కో- డైరెక్టర్: మహీధర్ గుంటుపల్లి, ప్రకాష్ పచ్చల, DOP; జవహర్ రెడ్డి, మ్యూజిక్; రాప్ రాక్ షకీల్, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, హుస్సేన్,  ఎడిటర్; బస్వా పైడి రెడ్డి, ఆర్ట్; విజయ్ కృష్ణ, ప్రొడక్షన్ కంట్రోలర్; జె.రామారావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here