బాపు జయంతి రోజునే.. సురేష్ కొండేటి కొత్త సినిమా షూటింగ్!
తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు సురేష్ కొండేటి. చిన్న వయసులో ఫిలిం నగర్ లో అడుగు పెట్టి సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సురేష్ కొండేటి ‘సంతోషం’ సురేష్ గా సుపరిచితులు. నటుడిగా 1996లో రాంబంటు సినిమాలో మొదటి సారి తెరపై నటుడిగా కనిపించిన ఆయన తనను నటుడిగా పరిచయం చేసిన బాపు గారి జయంతి రోజున ఒక సినిమాలో మంచి పాత్ర షూటింగ్ కూడా జరుపుకున్నారు. సీనియర్ నటుడు రాజీవ్ కనకాలతో కలిసి ఆయన షూట్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆయన త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తానని అన్నారు. ఇక రాంబంటు సినిమా తరువాత సుమారు 12 సినిమాల్లో అనేక రకాల పాత్రల్లో నటించిన ఆయన ఇటీవల దేవినేని సినిమాలో సెకండ్ లీడ్ హీరోగా చేయగా దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాసరి గారు తనకు స్ఫూర్తి అని చెప్పే సురేష్ కొండేటి దాసరిలా నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, డిస్ట్రిబ్యూటర్ ఇలా అన్ని రంగాల్లో ముద్రవేయాలనేది తన కోరిక అని చెబుతూ ఉంటారు.