వరుస సినిమాల నిర్మాణంలో ముందుకు వెళ్తున్న శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్

 

తనికెళ్ళ భరణి, కిశోరో దాసు లాంటి నటులతో తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో మొదలైన బ్యానర్ ప్రస్థానం
“ఎందరో మహానుభావులు”, “బ్లాక్ బోర్డ్” లాంటి ప్రయోగాత్మక సినిమాలు నిర్మించి ధియేటర్లల్లో విడుదల చేసిన తర్వాత వరుసగా నాలుగు సినిమాల్ని తెరక్కికిస్తున్నారు నిర్మాత తల్లాడ శ్రీనివాస్.

డిసెంబర్ 8 న తన పుట్టినరోజు సందర్భంగా తమ బ్యానర్లో జరుగుతున్న సినిమాల విశేషాల్ని తెలిపారు.

ప్రస్తుతం సీనియర్ నటుడు శరత్ బాబు యొక్క కుమారుడు ఆయుష్ తో *” దక్ష”* అనే సినిమా చేస్తున్నట్లు,
ఈ సినిమా కి వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు,

అలానే జర్నలిస్ట్ జానీ దర్శకత్వంలో *”నరుడి బ్రతుకు నటన”* అనే ఒక సినిమా,

తల్లాడ సాయికృష్ణ, నక్షత్ర కలిసి నటిస్తున్న అందమైన ప్రేమకథ
*”సొగసు చూడ తరమా”*,

కిరాణా షాపు వాళ్ళ యొక్క జీవన శైలి ని కళ్ళకు కట్టినట్లు తెరకెక్కుతున్న సినిమా
*”నమస్తే సేట్ జీ”*.

ఇలా ఈ నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయని,త్వరలో ఒక సినిమా తర్వాత ఒకటి విడుదల చేస్తున్నట్లు, కొత్త & టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ కి మా బ్యానర్ ఎప్పటికి సపోర్ట్ గా ఉంటుంది అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here