దక్ష – టైటిల్ లోగో ఆవిష్కరించిన తనికెళ్ళ భరణి, శరత్ బాబు

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాత గా, వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ” దక్ష”. ఈ సినిమా ద్వారా సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా కి సంబంధించిన టైటిల్ లోగో ను సీనియర్ నటులు తనికెళ్ళ భరణి మరియు శరత్ బాబు గారు విడుదల చేశారు.

 

 

ఈ సందర్భంగా సీనియర్ నటులు తనికెళ్ళ భరణి గారు మాట్లాడుతూ “దక్ష అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవాడు అని అర్థం”  అతనే మా  తల్లాడ సాయి కృష్ణ , తను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాడు. గతంలో తాను డైరెక్ట్ చేసిన ఒక వ్యవసాయ షార్ట్ ఫిలిం కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం చాలా గొప్ప విషయం. ఈ దక్ష చిత్రం లో మన శరత్ బాబు గారి తనయుడు ఆయుష్ హీరో గా పరిచయం అవుతున్నాడు. శరత్ బాబు గారు నాకు మంచి మిత్రుడు, ఎన్నో చిత్రాల్లో కలిసి పని చేసాం. ఆయుష్ కి ఈ చిత్రం మంచి విజయం అందించాలని, ఈ సినిమా లో పని చేసిన నటులకు టెక్నిషన్స్ అందరికీ మంచి అవకాశాలు రావాలి” అని కోరుకున్నారు.

 

శరత్ బాబు గారు మాట్లాడుతూ “ఆయుష్ నా తమ్ముడి కొడుకు, నా కొడుకు కూడా. ఆయుష్ కి ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. ఈ చిత్రం టైటిల్ లోగో కార్యక్రమానికి తనికెళ్ళ భరణి గారు గెస్ట్ గా రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి, నిర్మాతలకు మంచి డబ్బు సంపాదించి పెట్టి, దర్శకుడికి మంచి విజయం కావాలి” అని కోరుకున్నారు.

 

 

నటులు తల్లాడ వెంకన్న మాట్లాడుతూ “దక్ష చిత్రం టైటిల్ లోగో విడుదల చేసిన తనికెళ్ళ భరణి గారికి శరత్ బాబు గారికి నా శుభాకాంక్షలు. తల్లాడ సాయి కృష్ణ మా తమ్ముడి  కొడుకు, తనకు మంచి బంగారు భవిష్యత్తు ఉండాలి అని, ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అవుతున్న వివేకానంద విక్రాంత్ కి ఈ చిత్రం మంచి విజయం , పెరు తీసుకొని రావాలి అని, ఈ చిత్రం లో నటించిన నటి నటులకి, టెక్నిషన్స్ అందరికీ మంచి పేరు తెచ్చి పెట్టాలి” అని కోరుకున్నారు.

 

 

దర్శకుడు వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ “దర్శకుడిగా దక్ష నా మొదటి చిత్రం నిర్మాత తల్లాడ సాయి కృష్ణ చాలా సపోర్ట్ చేసాడు. సినిమా చాలా బాగా వచ్చింది, మంచి విజయం సాధిస్తుంది” అని కోరుకున్నారు.

 

 

హీరో ఆయుష్ మాట్లాడుతూ “నేను హీరో గా అవ్వాలి అన్నది నా డ్రీమ్. ముంబై లో యాక్టింగ్ కోర్స్ చేశాను. ఇప్పుడు దక్ష చిత్రం తో హీరో గా పరిచయం అవుతున్నాను. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడి పని చేసాం. హైదరాబాద్, అరకు, ఖమ్మం లాంటి ఎన్నో లొకేషన్స్ లో షూటింగ్ చేసాము. ఇది ఒక థ్రిల్లర్ సినిమా 2022, జనవరి లేక ఫిబ్రవరి లో విడుదల అవుతుంది. మీ అందరి సపోర్ట్ కావాలి.

 

హీరోయిన్స్ అను మరియు నక్షత్ర ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకున్నారు.

 

 

నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ “దక్ష చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం. మా చిన్న చిత్రానికి మీడియా సపోర్ట్ కావాలి. మంచి కథ తో మీ ముందుకు వస్తున్నాం. మీ సపోర్ట్ కావాలి” అని కోరుకున్నారు.

 

 

సినిమా : ” దక్ష ”
బ్యానర్ :- శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్
నిర్మాత :- తల్లాడ శ్రీనివాస్
కో-ప్రొడ్యూసర్ :- తల్లాడ సాయి కృష్ణ
డైరెక్టర్ :- వివేకానంద విక్రాంత్
హీరో , హీరోయిన్ లు :- ఆయుష్ , అను , నక్షత్ర , శోభన్ బాబు ,రవి రెడ్డి ,రియా ,అఖిల్ , పవన్   తదితరులు …
కథ – మాటలు :- శివ కాకు ,
కెమెరా :- శివ రాతోడు , ఆర్.ఎస్ . శ్రీకాంత్,
సంగీతం :- రామ్ తవ్వ ,
పబ్లిసిటీ డిజెన్స్ :- రాహుల్ , శ్యామ్ వీరవెల్లి , రాజేష్  బచ్చు ,
పిఆర్ఓ :-  పాల్ పవన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here