Home Entertainment Mission 2020 Movie Review

Mission 2020 Movie Review

0
18

రివ్యూ – మిషన్ 2020

నటీనటులు – నవీన్ చంద్ర, నాగబాబు, జయప్రకాష్, సత్య ప్రకాష్, చలాకీ చంటి, సమీర్, స్వాతి శర్మ తదితరులు

సాంకేతిక బృందం – సంగీతం – ర్యాప్ రాక్ షకీల్, ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్, సినిమాటోగ్రఫీ – వెంకట్ ప్రసాద్, బ్యానర్ – మధు మృదు ఎంటర్ టైన్ మెంట్స్, సమర్పణ – హనీ బన్నీ క్రియేషన్స్, శ్రీ మిత్ర & మై విలేజ్, నిర్మాతలు – కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కె వి ఎస్ఎస్ ఎల్ రమేష్ రాజు, దర్శకత్వం – కరణం బాబ్జి.

సినిమా అంటే వినోదమే. కానీ ప్రేక్షకుల్లో ఒక ఆలోచన రేకెత్తించగలిగేది గొప్ప సినిమా లక్షణం. మనం ఎదుర్కొంటున్న సమస్యలపై సినిమాలు తెరకెక్కించాలంటే గట్స్ కావాలి. అలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శించిన కొత్త సినిమా మిషన్ 2020. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కరణం బాబ్జి రూపొందించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన మిషన్ 2020 మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..

ఫైర్ బ్రాండ్ లాంటి నిజాయితీ గల పోలీస్ అధికారి జయంత్ (నవీన్ చంద్ర). నేరస్తులకు తనదైన శైలిలో గుణపాఠాలు చెబుతుంటాడు. చట్టంలోని లొసుగులు ఉపయోగించిన శిక్ష నుంచి తప్పించుకునే దుర్మార్గులైన నేరస్తులను ఎన్ కౌంటర్ చేసేస్తుంటాడు. ఎలాగైనా న్యాయాన్ని కాపాడాలి, సమాజాన్ని రక్షించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. బాగా చదువుకునే ప్రకాష్ అతని మిత్రబృందానికి అశ్లీల వీడియోల బాగా అలవాటు అవుతాయి. పోర్న్ వీడియోల వ్యసనానికి లోనవుతారు. ఈ అశ్లీల వీడియోలు చూసిన మోహంలో తమ స్నేహితురాలైన స్వాతి అనే అమ్మాయిపై అత్యాచారం చేస్తారు. ఈ రేప్ కేసును జయంత్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. మరి ఆ రేపిస్టులైన విద్యార్థులను పోలీస్ అధికారి జయంత్ ఎలా పట్టుకున్నాడు, వాళ్లకు ఎలాంటి శిక్ష పడేలా చేశాడు. ఆవేశంలో చేసిన ఒక తప్పు నలుగురు విద్యార్థుల జీవితాలను ఎలాంటి ప్రమాదంలో పడేసింది అనేది మిగిలిన కథ.

విశ్లేషణ

యువత పోర్న్ వీడియోల మత్తులో పడి భవిష్యత్ ను ఎలా పాడుచేసుకుంటున్నారు అనే అంశంతో తెరకెక్కిన సినిమా ఇది. ఇలాంటి పాయింట్ తో ఆలోచింపజేసేలా సినిమా తెరకెక్కించిన దర్శకుడు కరణం బాబ్జి అభినందనీయుడు. టీనేజ్ లో తెలిసీ తెలియని వయసులో కొందరు యువతకు ఈ అశ్లీల వీడియోలు ఓ వ్యసనంలా మారాయి. వాటి ప్రభావంతో జీవితంలో దిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. ఇలాంటి యువత పట్ల సమాజం స్పందించే తీరు కూడా ప్రశ్నించాల్సిన విషయమే. దర్శకుడు బాబ్జి ఈ విషయాన్ని కూడా ఆలోచింపజేసేలా రూపొందించాడు. సమాజం మారాలంటే మార్పు మన నుంచే మొదలవ్వాలని చెప్పిన విధానం బాగుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ జయంత్ పాత్రలో నవీన్ చంద్ర నటన ఆకట్టుకుంది. మంచిని కాపాడాలనే తన ఆవేశం, అమాయకులను రక్షించి, దుర్మార్గుల ఆటకట్టించేందుకు అతను చేసిన ప్రయత్న నవీన్ చంద్ర నటనలో కనిపించింది. ఒక ఎమోషనల్, పైర్ బ్రాండ్ పోలీస్ ఆఫీసర్ కు ఉండాల్సిన భావోద్వేగాలను పలికించాడు నవీన్ చంద్ర. నాగబాబు, జయ ప్రకాష్, సత్య ప్రకాష్ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సమీర్, చలాకీ చంటి పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. శ్రీ రాపాక స్పెషల్ సాంగ్ మాస్ కు ట్రీట్ ఇస్తుంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు సందేశాన్ని షుగర్ కోటెడ్ గా చెప్పేందుకు దర్శకుడికి ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో పెట్టక తప్పలేదు. అవన్నీ మిషన్ 2020 సినిమాను ఎంగేజింగ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా మార్చాయి. సాంకేతికంగా ఉన్నంతగా ఉందీ సినిమా. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఎస్ బి ఉద్ద‌వ్ ఎడిటింగ్ బాగున్నాయి. ఇక సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. శ్రీ రాపాక స్పెషల్ సాంగ్ “అల్లుడు గారెలు వండాలా” పాట థియేటర్ లో మాస్ ఆడియెన్స్ ను ఊపేసింది. “సెల్లు సెల్లు” పాట కూడా అదిరిపోయింది. పాటలే కాదు ర్యాప్ రాక్ షకీల్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా తర్వాత ర్యాప్ రాక్ షకీల్ నెక్ట్ లెవెల్ సినిమాలు చేసే అవకాశాలు రావడం ఖాయం.

Rating : 3.25/5

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here