Home Entertainment Telangana Devudu to release on 12th November

Telangana Devudu to release on 12th November

0
184

నవంబర్ 12న థియేటర్లలోకి ‘తెలంగాణ దేవుడు’

మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్‌ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. సంగీత, బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, తనికెళ్ల భరణి వంటి 50 మంది అగ్ర నటీనటులు నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ శుక్రవారం చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. చరిత్ర సృష్టించిన వ్యక్తి పాత్రలో చేయడం నిజంగా గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. నవంబర్ 12న సినిమా విడుదలవుతుంది..’’ అని అన్నారు.

దర్శకుడు హరీష్‌ వడత్యా మాట్లాడుతూ.. ‘‘ ‘తెలంగాణ దేవుడు’ వంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత జాకీర్ ఉస్మాన్ గారికి, చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. నవంబర్ 12న మా ‘తెలంగాణ దేవుడు’ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నాం..’’ అని తెలిపారు.

చిత్ర నిర్మాత మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి బయోపిక్‌గా రూపుదిద్దుకున్న మా ‘తెలంగాణ దేవుడు’ చిత్రంలో.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగిందనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించాం. ఇది ఓ మహనీయుని చరిత్ర. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఒక నిఘంటువు. అటువంటి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉద్యమనాయకుని చరిత్ర అందరికీ తెలియాలనే.. ఈ చిత్రం చేశాము. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము’’ అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరో జిషాన్ ఉస్మాన్ , చిట్టిబాబు, కాశినాధ్, అప్పాజీ, బస్టాప్ కోటేశ్వరరావు, డాక్టర్ శ్రీహరి, బుల్లెట్ భాస్కర్, మ్యాక్ లాబ్ సిఈఓ మొహ్మద్ ఇంతెహాజ్‌ అహ్మద్‌, సంగీత దర్శకుడు నందన్ రాజ్ బొబ్బిలి, మహమూద్ అజ్మతుల్లా, లైన్ ప్రొడ్యూసర్ మహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు
.

పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు
మ్యూజిక్: నందన్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్: గౌతంరాజు
లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్ ఖాన్
పీఆర్వో: బి. వీరబాబు
మూల కథ, నిర్మాత: మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్
రచన, దర్శకత్వం: వడత్యా హరీష్

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here