ఆసక్తికరమైన సస్పెన్స్ క్రైం త్రిల్లర్ “అసలేం జరిగింది”

వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన చిత్రం “అస‌లేం జ‌రిగింది”. శ్రీరాం, సంచిత పదుకొనె జంటగా నటించారు. గతంలో సినిమాటోగ్రాఫ‌ర్‌గా చేసిన ఎన్‌వీఆర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా… మైనేని నీలిమా చౌద‌రి, కొయ్యాడ కింగ్ జాన్స‌న్ క‌లిసి ఎక్సోడ‌స్ మీడియా ప‌తాకంపై ఈ సినిమాను నిర్మించారు. గ్రామీణ నేప‌థ్యంతో కూడిన ఈ సినిమా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ల‌వ్‌స్టోరీగా రూపొందింది. ప్రేమ‌, స‌స్పెన్స్, యాక్ష‌న్… సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈచిత్రం ప్రేక్షకులను ఏమాత్రం త్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.

కథ: ఒక ఊరిలో బాగా చదువుకుని వైద్య వృత్తిలో కొనసాగుతుంటాడు హీరో శ్రీరామ్.. అయితే ఆ ఊళ్ళో ప్రతి అమావాస్యకు ఒకరు హత్యకు గురవుతుంటారు. ఇది ఆ గ్రామంలో సంచలంగా మారుతుంటుంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ తల్లిదండ్రులను ఓ అదృశ్య శక్తి బలితీసుకొని… హీరోయిన్ పై మోజు పడుతుంది. ఈ మిస్టరీని అంతా చేధించాలనుకుంటాడు హీరో. మరి అమావాస్య రోజు ఆ ఊళ్ళో ఎందుకు చంపబడుతున్నారు? ఆ అదృశ్య శక్తి ఎవరు? ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: రియల్ ఇన్సిడెంట్ బేస్ తో తెరకెక్కిన కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ప్రేక్షకులు కూడా వీటిని బాగా ఆదరిస్తారు. అందుకే దర్శకుడు NVR ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథకు… ప్రేమను జోడించి ఆద్యంతం ఆడియన్స్ ని ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఓ తాంత్రికుడు తనకు గతంలో జరిగిన నష్టాన్ని… కక్ష రూపంలో గ్రామస్తులు…. ఆ ఊరి అందమైన యువతులపై ఎలా తీర్చుకున్నాడనేదాన్ని చాలా ఆసక్తికరంగా రూపొందించారు. ఈ చిత్రానికి మంచి బడ్జెట్ ఉంటే… కచ్చితంగా బాహుబలి లాంటి సినిమాను రూపొందించగలిగే స్టఫ్ ఈ కథలో ఉంది. గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రంలో ఇంకాస్త బడ్జెట్ తో క్వాలిటీగానే గ్రాఫిక్స్ ని రూపొందించొచ్చు. తన డెబ్యూ కోసం రియల్ స్టోరీని ఎంచుకొని దర్శకుడు మంచి స్టెప్ తీసుకున్నాడు. మూవీ ఎక్కడా బోరింగ్ లేకుండా తెరకెక్కించాడు. సినిమాటో గ్రఫీ రిచ్ గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ గ్రామీణ వాతావరణాన్ని బాగా తీర్చి దిద్దారు. దీన్ని సినిమాటోగ్రాఫర్ బాగా చూపించారు. సినిమాకు ప్రధాన హైలైట్ నేపథ్య సంగీతం. కొన్ని సన్నివేశాలను బాగా బీజీఎమ్ తో లేపారు. హీరో శ్రీరామ్ చాలా కాలం తర్వాత ఇందులో ఓ మంచి పాత్రను పోషించి.. హైలైట్ గా నిలిచాడు. అతనికి జంటగా నటించిన కన్నడ బ్యూటీ సంచిత పదుకొనె గ్రామీణ అమ్మాయిగా చక్కగా నటించింది. తాంత్రికునిగా మెయిన్ విలన్ పాత్ర పోషించిన వ్యక్తి బాగా నటించి ఆకట్టుకుంటాడు. నిర్మాతలు తమకున్న బడ్జెట్లో ఓ మంచి క్వాలిటీ సినిమాను నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్…!!!

రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here