Home Entertainment Darjaa movie title look launched

Darjaa movie title look launched

0
160

మాజీ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించిన ‘దర్జా’ టైటిల్ లుక్ పోస్టర్

శ్రీ కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి శివశంకర్ పైడిపాటి నిర్మాత. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరించనున్నారు. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ను మాజీ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘శివ శంకర్ నాకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆయన నిర్మిస్తోన్న ‘దర్జా’ చిత్ర టైటిల్ లుక్ చాలా బాగుంది. ఈ చిత్రయూనిట్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను..’’ అన్నారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర టైటిల్ లుక్‌ని విడుదల చేసిన శ్రీ కామినేని శ్రీనివాస్‌గారికి ధన్యవాదాలు. సీనియర్ నటీనటులు, నూతన నటీనటుల కలయికలో ఈ చిత్రం తెరకెక్కనుంది. హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నం వంటి ప్రదేశాలలో షూటింగ్ జరపనున్నాం. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో సునీల్, అనసూయ పాత్రలు హైలెట్‌గా ఉంటాయి. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నాం..’’ అని తెలిపారు.

సునీల్, అనసూయ, అక్సాఖాన్, షమ్ము, సత్యనారాయణరాజు (సత్తిపండు), షకలక శంకర్, సుధ, సూర్య, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
కెమెరా: దర్శన్,
సంగీతం: రాప్ రాక్ షకీల్,
ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ,
కథ: నజీర్,
మాటలు: పి. రాజేంద్రకుమార్,
ఎగ్జిక్యూటీవ్ ప్రొడక్షన్ మేనేజర్: బందర్ బాబీ,
స్ర్కిఫ్ట్ కో ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ,
పీఆర్ఓ: బి. వీరబాబు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రవి పైడిపాటి,
నిర్మాత: శివశంకర్ పైడిపాటి,
స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సలీమ్ మాలిక్.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here