స్నేహం మీద ఎన్నో చిత్రాలు వచ్చాయి, అని సూపర్ హిట్ చిత్రాలే. కానీ మనం చూసిన చిత్రాల్లో ఇద్దరు ప్రాణ స్నేహితుల ఉంటారు మరియు ఇద్దరు కలిసి సమస్యని ఎదురుకుంటారు. కానీ సూర్యాస్తమయం చిత్రం లో నాణానికి రెండు వైపులా లా ఉంటారు ఇద్దరు స్నేహితులు. ఒకరు పోలీస్ ఇంకొకరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. మరి వారి స్నేహం వాళ్ళ జీవితాల్ని ఎలాంటి మలుపులు తీపుతుంది అనేదే సూర్యాస్తమయం కథ. బండి సరోజ్ కుమార్ మరియు ప్రవీణ్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కొత్త స్క్రీన్ ప్లే తో మంచి సంగీతం లో మంచి విసుల్స్ తో అద్భుతంగా దర్శకత్వం వహించారు బండి సరోజ్ కుమార్.
కథ
చెగేవార (బండి సరోజ్ కుమార్) ఒక పోలీస్ ఆఫీసర్. తాను కలుపు మొక్కలను ఎంకౌంటర్ చేస్తుంటాడు. అలాంటి ఎంకౌంటర్ ఆఫీసర్ కి నెక్స్ట్ టార్గెట్ ప్రవీణ్ రెడ్డి. తననే వెతికే క్రమంలో ప్రవీణ్ రెడ్డి తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు అని తెలుస్తుంది. మరి చెగేవార ఏమి చేస్తాడు , తర్వాత ఏమి జరుగుతుంది అనేది కథ.
స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. మూడు భాగాలుగా కథ ఉంటుంది. వాళ్ళ బాల్యం, కాలేజ్ లైఫ్ మరియు పోలీస్ ఆఫీసర్ కథ. ఈ మూడు భాగాలని దర్శకుడు సరికొత్త స్క్రీన్ ప్లే తో కలుపుతాడు. సినిమా చూడటానికి చాలా కొత్తగా ఉంటుంది. కెమెరా పనితనం, మ్యూజిక్ మరియు సహజమైన లొకేషన్స్ అని ఈ చిత్రానికి హై లైట్. పాటలు కథలో కలిసిపోయి ఉంటాయి. వేట, స్నేహం మరియు సూరీడు పాటలు చాలా బాగుంటాయి. లొకేషన్స్ సహజనికి డాగర ఉంటాయి. ఈ చిత్రానికి దర్శకుడు 11 క్రాఫ్ట్స్ చేసాడు, అన్ని అద్భుతంగా కుదిరాయి. తెలుగు ప్రేక్షకులకి సూర్యాస్తమయం చిత్రం చాలా కొత్తగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది.
దర్శకుడు బండి సరోజ్ కుమార్ ఈ చిత్రం లో ఒక హీరో గా నటించాడు. ఫస్ట్ హాఫ్ అంత తానే ఉంటాడు. ప్రవీణ్ రెడ్డి సెకండ్ హాఫ్ లో ఉంటాడు. తన పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంటుంది. తన డాన్స్, నటన, యాక్షన్ సన్నివేశాలు అని బాగుంటాయి. కృష్ణుడు చిత్ర నిర్మాత ప్రేమ్ కుమార్ పాత్ర మంచి క్యారెక్టర్ చేసారు. హిమాన్షి మంచి నటన ప్రదర్శించింది. ఇతరులు వారి వారి పాత్రలో చక్కగా నటించారు.
సూర్యాస్తమయం మంచి టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించబడిన సినిమా. అద్భుతమైన సంగీతం, నటన, మంచి స్క్రీన్ ప్లే, సహజమైన లొకేషన్ లో కొత్త కథలో కనువిందు చేయటానికి 27 ఆగష్టు నా విడుదల చేసారు. ఒక ఇంగ్లీష్ సినిమా చుసిన ఫీలింగ్ వస్తుంది. తప్పక చుడండి.
రేటింగ్ : 3/5