వినోదభరితం… వివాహ భోజనంబు

కథ: మహేష్ (సత్య) ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తూ… డబ్బులు పొదుపుగా ఖర్చు పెట్టే ఓ మధ్య తరగతి యువకుడు. తనని పిసినారి అంటే… కాదు నేను జాగ్రత్తపరుడిని అంటాడు. మహేష్… అనిత (అర్జావీ రాజ్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.. దాంతో ఇరు కుటుంబాలు వీరిద్దరి వివాహం చేయాలనుకుంటారు.
కరోనా టైమ్ కాబట్టి పరిమిత అతిథులతో మహేష్ ఇంట్లో పె‌ళ్లి వేడుక జరుగుతుంది. పెళ్లైన తర్వాత లాక్ డౌన్ రావడంతో మొత్తం అతిథులంతా మహేష్ ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ టైమ్ లో అయ్యే ఖర్చులను ప్రతి రూపాయి లెక్కించే మహేష్… ఎలా భరించాడు. వాళ్లను ఎలా మేనేజ్ చేసాడు? అనేది మిగిలిన కథ.

మూవీ ఎలా ఉందంటే…
చాలా మంది కామెడీ నటులు హీరోలుగా రాణించాలని తమ అదృష్టాన్ని వెండితెరపై పరీక్షించుకున్నారు. తాజాగా హాస్య నటుడు సత్య కూడా తనకు బాగా సూట్ అయ్యే కథతోనే మన ముందుకు వచ్చారు. ఈ చిత్ర కథ… కామెడీ కోసం ప్రత్యేక శ్రమ తీసుకోకుండా కథలోనే కావాల్సినన్ని నవ్వులకు అవకాశం ఉన్న కథ ఇది. ఓ పొదుపు గల యువకుడు వేలకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు… అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే నవ్వొస్తుంది. లాక్ డౌన్ లో డజను మంది అతిథులకు రోజూ అయ్యే ఖర్చులు, వాటికి మహేష్ రెస్పాండ్ అయ్యే సీన్స్ హిలేరియస్ గా ఉన్నాయి. “వివాహ భోజనంబు” లో బేసిక్ ప్లాట్ ఇదే అయినా లవ్, ఎమోషన్స్ కూ చోటుంది. మహేష్ క్యారెక్టర్ సత్యకు టైలర్ మేడ్. తన పిసినారి వ్యక్తిత్వం, దానికి ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్లు అనే మాటలకు తను స్పందించే విధానం, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆర్జీవీ రాజ్ నాయికగా మెప్పించింది. సత్యకు ఆమె జోడి బాగా కుదిరింది. హీరో హీరోయిన్స్ తో పాటు కథలో కీలక పాత్ర శ్రీకాంత్ అయ్యంగార్ ది. పిసినారి లక్షణాలు ఉన్న అల్లుడికి కూతురును ఇచ్చి పెళ్లి చేయడానికి అతను పడే ఇబ్బంది నవ్విస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్ కెరీర్ లో ఇదొక బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఆంబులెన్స్ డ్రైవర్ నెల్లూరి ప్రభ (సందీప్ కిషన్) పాత్ర ఉన్నంత సేపూ నవ్విస్తుంది. అతని క్యారెక్టర్ కు మంచి డైలాగ్స్ పడ్డాయి. సందీప్ కిషన్ ఈ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. సుబ్బరాయ శర్మ, టీఎన్ఆర్, వైవా హర్ష, శివన్నారాయణ, మధు మణి క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంట్ వేే. ఇక టెక్నికల్ అంశాల్లో మణికందన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది, నందు ఆర్ కె మాటలు నవ్వించాయి. దర్శకుడు రామ్ అబ్బరాజు ఫస్ట్ ఫిలింతోనే మంచి అటెంప్ట్ చేశాడు. అతనిలో ఓ జంధ్యాల, ఓ ఈవీవీ, ఒక రేలంగి నరసింహారావు స్టైల్ ఆఫ్ మేకింగ్ కనిపించింది. కథంతా కామెడీ కాకుండా ఓ ఎమోషనల్ పాయింట్ పెట్టి సినిమాకో పర్పస్ క్రియేట్ చేశాడు రామ్ అబ్బరాజు. కథానాయుకుడు ఎందుకు పిసినారి అయ్యాడో రీజన్ చెప్పాడు, చివరలో హీరో మంచి మనసునూ చూపించాడు. పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా సినిమాను క్వాలిటీగా నిర్మించారు. సో… సోనీ లివ్ లో వాచ్ ఇట్..!!!

రేటింగ్ – 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here