Home Entertainment Orey Bamardhi film will be realistic – Director Sasi

Orey Bamardhi film will be realistic – Director Sasi

0
258

“ఒరేయ్ బామ్మర్ది” సినిమాలో బావ బావమరిది రిలేషన్స్ ఆకట్టుకుంటాయి – దర్శకుడు శశి

భావోద్వేగ కథలతో సినిమాలు చేస్తూ దక్షిణాదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు దర్శకుడు శశి. ఆయన తెరకెక్కించిన శీను, రోజాపూలు, బిచ్చగాడు లాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఎమోషనల్ ఫీల్ పంచాయి. సిద్దార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ హీరోలుగా శశి రూపొందించిన కొత్త సినిమా ఒరేయ్ బామ్మర్ది ఆగస్టు 13న థియేటర్ లలో విడుదల కాబోతోంది. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు శశి సినిమా విశేషాలను పంచుకున్నారు.

*దర్శకుడు శశి మాట్లాడుతూ*….హ్యూమన్ ఎమోషన్స్ లేకుండా నేను ఏ సినిమా చేయను. బిచ్చగాడు సినిమాలో తల్లీ కొడుకు మధ్య ప్రేమను చూపించాను. ఒరేయ్ బామ్మర్ది చిత్రంలో బావ బావమరిది మధ్య అనుబంధాలను చూపిస్తున్నాం. బావ బావమరిది మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మా సినిమాకు పనిచేసే ఒక రచయితను నీకు పెళ్లి అయ్యిందా అని అడిగితే ఆయన ఈ మధ్యే నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్య చిన్న తమ్ముడు మంచి ఫ్రెండ్ అయ్యాడు. నా తమ్ముడి కంటే ఈ బావమరిది తోనే నేను ఎక్కువ చనువుగా ఉంటాను, అతను ఎవరు చెప్పింది విన్నా వినకున్నా, నా మాట మాత్రం తప్పకుండా వింటాడు, కొడుకు, తమ్ముడు, ఫ్రెండ్ అన్నీ వాడే నాకు అని చెప్పాడు. ఆ రిలేషన్ నాకు గొప్పగా అనిపించింది. అప్పుడే ఒరేయ్ బామ్మర్ది సినిమా కథకు నా మనసులో ఆలోచన మొదలైంది. ఇది 20 ఏళ్ల కిందటి మాట. నాకు తెలిసి ప్రతి స్క్రిప్టు సినిమాగా మారేందుకు కొంత టైమ్ తీసుకుంటుంది. కనీసం మూడేళ్లు ఒక స్క్రిప్ట్ దర్శకుడి దగ్గర ఉండిపోతుందని నా అంచనా. ఎందుకంటే సినిమా చేయాలంటే అన్నీ కుదరాలి. సివప్పు మంజల్ పచ్చై అనే పేరుతో తమిళ్ లో ఈ మూవీని రూపొందించాం. తెలుగులో రీమేక్ చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దాంతో డబ్ చేసి విడుదల చేస్తున్నాం. బిచ్చగాడు డబ్ వెర్షన్ తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీకు తెలుసు. ఒరేయ్ బామ్మర్ది కథ సిద్ధార్థ్ కు చెప్పాక తనను బావమరిది క్యారెక్టర్ చేయమని అడిగాను. కానీ సిద్ధార్థ్ కు బావ క్యారెక్టర్ నచ్చి అది సెలెక్ట్ చేసుకున్నాడు. బావమరిది క్యారెక్టర్ లో జీవీ ప్రకాష్ కుమార్ ని తప్ప మరొకరు సెట్ కారు అనిపించింది. సిద్ధార్థ్ చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. జీవీ కూడా సూపర్బ్ గా యాక్ట్ చేశాడు. ఇందులో యాక్షన్ సీన్స్ బాగా కుదిరాయి. ఈ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here