ఆగస్టు 3 నుండి “దక్ష” సినిమా. మూడో షెడ్యూల్ షూటింగ్ మొదలు

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ పైన శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా గా నటిస్తున్న సినిమా
” దక్ష”. వివేకానంద విక్రాంత్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ సినిమా కి తల్లాడ శ్రీనివాస్ నిర్మాత. లాక్డౌన్ తర్వాత షూటింగ్స్ మొదలు అవ్వడం తో దక్ష సినిమా సైతం మూడో షెడ్యూలు షూటింగ్ ని ఆగస్టు 3 నుండి అరకులో చేపట్టనున్నట్లు చిత్ర బృందం తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ సస్పెన్స్ త్రిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమా క్వాలిటీ ఆప్ ప్రొడక్ట్ గా నిర్మిస్తున్నాం, మాకున్న వనరుల్లో ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమా ని తీస్తున్నాం అన్నారు.

డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ ఈ జోనర్ సినిమాలకి మార్కెట్ లో స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు, అలాంటి వారికే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది,థియేటర్లు కూడా రీ ఓపెన్ అయ్యాయి, మా దక్ష సినిమా కూడా థియేటర్ లోనే విడుదల చేసి,ఆడియన్స్ కి మంచి థ్రిల్లర్
సినిమా చూసాం అనే అనుభూతిని ఇస్తాం అన్నారు.

ఆయుష్,రవి రెడ్డి, అఖిల్,అను, నక్షత్ర, రియా, శోభన్ బాబు, పవన్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కి రచన – శివ కాకు, కెమేరా- శివ రాథోడ్,శ్రీకాంత్,
డైరెక్టర్- వివేకానంద విక్రాంత్,
పి.ఆర్.ఓ- పవన్ పాల్, మేకప్- గణేష్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్- అశోక్ నిమ్మల, విజయ్ నిట్టాల, గౌతమ్,
కో-ప్రొడ్యూసర్ – తల్లాడ సాయికృష్ణ,
నిర్మాత – తల్లాడ శ్రీనివాస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here