ఆగస్టులో రిలీజ్ కు సిద్ధమవుతున్న తనీష్ “మహా ప్రస్థానం”

తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహా ప్రస్థానం’. ఈ చిత్రాన్ని ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహా ప్రస్థానం’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో రూపొందిన మొదటి తెలుగు సినిమా ‘మహా ప్రస్థానం’ కావడం విశేషం.

ఆగస్టులో ‘మహా ప్రస్థానం’ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లకు మంచి స్పందన రావడంతో పాటు హీరో సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో సినిమా విజయంపైనా ‘మహా ప్రస్థానం’ యూనిట్ నమ్మకంతో ఉంది.

*ఈ సందర్భంగా దర్శకుడు జాని మాట్లాడుతూ*…ఒక క్రిమినల్ ఎమోషనల్ జర్నీగా “మహా ప్రస్థానం” సినిమా ఉంటుంది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఒక మూడ్ లోకి, కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.  సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్ లేకుండా తెరకెక్కించిన చిత్రమిది. సినిమా కథంతా నేచురల్ గా ఒక ఫ్లో లో కనిపించేలా షూట్ చేశాం. థియేటర్ లో ఆడియెన్స్ కు థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. ప్రస్తుతం సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఆగస్టు లో థియేటర్ లలో “మహా ప్రస్థానం” చిత్రాన్ని విడుదల చేస్తాం. అన్నారు.

రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు – వసంత కిరణ్, యానాల శివ, పాటలు – ప్రణవం.., సంగీతం – సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ – ఎంఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ – క్రాంతి (ఆర్కే), ఎస్ఎఫ్ఎక్స్ – జి. పురుషోత్తమ్ రాజు, కొరియోగ్రఫీ – కపిల్, ఫైట్స్ – శివ ప్రేమ్, కథా కథనం దర్శకత్వం – జాని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here