Home Entertainment New OTT platform RealFlix

New OTT platform RealFlix

0
341

తెలుగు వినోదరంగంలో సరికొత్త సంచలనం

REALFILX –
OTT PLATFORM

కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకులకు సరికొత్త పంథాలో వినోదాన్ని అందించడం కోసం అన్ని హంగులతో వస్తోంది – REALFLIX – OTT సరికొత్త సినిమాలు, వినూత్నమైన వెబ్ సిరీస్ లు, ఆకట్టుకునే సూపర్ రియాలిటీ షోస్… ఇవన్నీ ఇకపై మీకు అందించే ఏకైక OTT Realflix.

ఎనీ టైమ్ థియేటర్. మీ ఇంట్లోనే, మీకు కుదిరిన సమయంలో, మీరు కోరుకునే కొత్త సినిమాలను మీకు అందించే లక్ష్యంతో, సరికొత్త టెక్నాలజీతో రూపొందింది REALFLIX App.

అలాగే,
Over The Top ఎంంటర్టైన్మెంట్… నవతరపు వినోదమైన వెబ్ సిరీస్‌లు, సూపర్ రియాలిటీ షోస్ తో పాటు తెలుగువారు మెచ్చే ఎన్నో మంచి సినిమాలను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీకు అందించే లక్ష్యంతో రూపుదిద్దుకుంది – REALFLIX OTT App.
అత్యాధునికమైన టెక్నాలజీతో ఒకే యాప్ లో వినోద రంగంలో సరికొత్త సంచలనాలకు నాంది పలుకుతూ మీ ముందుకు వస్తోంది REALFLIX App. ఈ యాప్ రూపకర్త – ఏషియన్ మీడియా 24 సంస్థ.

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, Next Generation వినోద అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ OTT platforms కి దీటుగా ఏషియన్ మీడియా 24 సంస్థ ఈ యాప్ ని రూపొందించి మీ ముందుకు తీసుకువస్తోంది.
ఈ శుభసందర్భంగా REALFLIX App లోగో ఆవిష్కరణ తెలుగు ప్రముఖులు, ఆత్మీయ అతిథుల సమక్షంలో వైభవంగా జరిగింది.

ఎన్నో విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా సీనిరంగంలో ఎన్నో విజయాలనూ, విశేష అనుభవాన్నీ సొంతం చేసుకున్న శ్రీ నాగేంద్రబాబు గారి సారథ్యంలో REALFLIX App రూపుదిద్దుకుంది.
అంతే కాకుండా, REALFLIX App కోసం సినిమాలు, వెబ్ సిరీస్ లు, సూపర్ రియాలిటీ షోలు చేయాలనుకునే అనుభవజ్ఞలనూ, ఔత్సాహికులనూ ఆహ్వానిస్తోంది ఏషియన్ మీడియా 24 నిర్మాణ సంస్థ. అలాగే, నటీనటులుగా రాణించాలనుకునే ఉత్సాహవంతులైన యువతీయువకులకు వారి ప్రతిభకు తగిన అవకాశాలను అందిస్తుంది.

కొత్త ఆలోచనలు, కొత్త కథలు, కొత్త పంథాలతో సినిమాలు, వెబ్ సిరీస్ లు తీయాలనే ఆసక్తి, ఉత్సాహం ఉండి రచయితలు, దర్శకులు, టెక్నీషియన్లుగా రాణించాలనే సంకల్పం ఉన్న వారికి… వారి కలలను రియల్ ఫ్లిక్స్ గా మార్చి, వారి ఆలోచనలను తెలుగు ప్రేక్షకుల ముందు ఆవిష్కరిస్తుంది ఏషియన్ మీడియా 24 సంస్థ. మీ కథలతో, మీ ఆలోచనలతో రండి, మీ ప్రతిభని ఆవిష్కరించండి.
ఆంధ్ర ప్రదేశ్ నుండి వెలువడుతున్న తొలి ప్లాట్‌ఫామ్ ఇది….
అతి త్వరలో మీ ముందుకు వస్తోందని
తెలుగువారందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నామని సంస్ధ ప్రతినిధి చెప్పారు….

REALFLIX –
OTT PLATFORM

ENTERTAINS YOU LIKE NEVER BEFORE.

POWERED BY… ASIAN MEDIA 24

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here