విక్ట‌రి వెంక‌టేష్ `నార‌ప్ప‌` సెన్సార్ పూర్తి U /A సర్టిఫికేట్

హీరో వెంకటేష్ తన దశాబ్దాల సుదీర్ఘ సినీకెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌తో విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్నారు. విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నార‌ప్ప‌`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య `సుందరమ్మ`గా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌ గ్లిమ్స్‌, పోస్టర్స్‌తో పాటు ‌విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన `నార‌ప్ప` టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు సినిమా చూసి యూనిట్ సభ్యులను ప్రశంసించారు. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో డిఫ‌రెంట్‌ షేడ్స్ ఉన్న పాత్రల‌లో విక్ట‌రి వెంకటేష్ కనిపించనున్నారు. అలాగే త‌న అద్భుతమైన నటనతో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌నున్నారు. వెంకటేష్‌ను ఇంత‌వ‌ర‌కూ మ‌నం చూడ‌ని ఒక కొత్త‌ అవతారంలో చూపించ‌నున్నారు ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల. అలాగే ఆయ‌న మేకింగ్ ఈ సినిమాకి బిగ్ అసెట్ కానుంది.

తారాగ‌ణం: విక్టరి వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌
ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌
కథ: వెట్రిమారన్‌
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌
లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం
ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి.
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్ పండీ
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్ డొంకాడ
కో- ప్రొడ్యూసర్‌: దేవి శ్రీదేవి సతీష్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here