Home Entertainment Pakka Commercial first look is Out on Gopichand’s Birthday

Pakka Commercial first look is Out on Gopichand’s Birthday

0
284

మ్యాచో హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా స్టార్ డైరెక్ట‌ర్ మారుతి, జీఏ2 పిక్చ‌ర్స్ – UV క్రియేష‌న్స్ కాంబినేష‌న్ లో ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ పోస్టర్ విడుదల..

ప్ర‌తి రోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌రువాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ వ‌రుకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఇదే రీతిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని కీల‌క ప్ర‌క‌ట‌ణ‌ల‌ను సైతం ద‌ర్శ‌కుడు మారుతి త‌న‌దైన శైలిలో విడుద‌ల చేస్తూ వచ్చారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. జూలై మొదటి వారంలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. ఇప్పుడు విడుదలైన పోస్టర్లలో కూడా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు – కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు.
ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వస్తుంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశి ఖన్నా. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియ జేయనుంది.
తారాగణం
గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్
టెక్నికల్ టీం:
స‌మ‌ర్ప‌ణ – అల్లు అరవింద్
బ్యాన‌ర్ – జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్
నిర్మాత‌ – బ‌న్నీ వాస్
ద‌ర్శ‌కుడు – మారుతి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ – ర‌వీంద‌ర్
మ్యూజిక్ – జ‌కేస్ బీజాయ్
స‌హ నిర్మాత – ఎస్ కే ఎన్
ఎడిటింగ్ – ఎన్ పి ఉద్భ‌వ్
సినిమాటోగ్ర‌ఫి – క‌ర‌మ్ చావ్ల‌
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here