“తేర కోసం వేషాలు” పాట విడుదల
వి-ప్రొడక్షన్ హౌస్ పతాకం పై మనోజ్ కుమార్ శంబు దర్శకత్వంలో శ్రీను సునీల్ నిర్మిస్తున్న చిత్రం “తేర కోసం వేషాలు”. ఈ సినిమా కి సంబంధించిన టైటిల్ సాంగ్ ని ఆదివారం నాడు విడుదల చేసారు.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీనుసునీల్ మాట్లాడుతూ “మేము ఇటీవలే “తేర కోసం వేషాలు” మొదటి పోస్టర్ ను విడుదల చేసాము. మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు మొదటి పాటని మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఈ పాటను వన్ మ్యూజిక్ ఆడియో ద్వారా విడుదల చేస్తున్నాం. అందరికి నచ్చుతుంది. ఈ పాట విషయానికి వస్తే , సినిమా రంగంలో నిలదొక్కుకోవాలని ,రాణించాలని ఎంత కసిగా ఉంటారో ఈ పాట చెబుతుంది . అంటే సినిమా పట్ల ప్రేమ ఇష్టము, సినిమా కోసం ఎం వదులుకుంటారో , ఏ విధంగా కోరికలను చంపుకొని ఎలా విజయం సాదిస్తామో ఈ పాటలో చెప్పడం జరిగింది. ఈ పాట కొత్తగా సినిమా ప్రపంచానికి రావాలనుకుంటున్నా ప్రతి వాడి ఆవేదన. ఇంకా ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేస్తాము. చివరగా మా పాట ప్రతి కళాకారుడి రింగ్ టోన్ అవుతుంది అని మా ఈ “తెర కోసం వేషాలు ” చిత్రం యూనిట్ సభ్యులు అ అందరం భావిస్తున్నాం అని నిర్మాత అన్నారు.
స్వరాగ్ కీర్తన్ పాడిన ఈ పాటకి వంశికాంత్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా కి జీవన్ కథ అందించారు.