టాలీవుడ్లో తొలిసారి 70 మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకుని ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన పుష్ప ఇంట్రడక్షన్ వీడియో ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన మార్కెట్ పెంచుకుంటున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈయన పుష్ప సినిమాలో నటిస్తున్నారు. బబ్లీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సంచలన దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి చెందిన పుష్ప ఇంట్రడక్షన్ వీడియో యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పుష్ప రాజ్ పాత్రను పరిచయం చేస్తూ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో కు అద్భుతమైన స్పందన వస్తుంది. విడుదలైన క్షణం నుంచి రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో 70 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న తొలి ఇంట్రడక్షన్ వీడియోగా అల్లు అర్జున్ పుష్ప చరిత్ర సృష్టించింది. తెలుగు ఇండస్ట్రీలో మరే ఇతర సినిమాకు సాధ్యం కాని రికార్డుల్ని అల్లు అర్జున్ తిరగరాశారు. ఈ వీడియోలో దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. సినిమాకు సంబందించిన మరిన్ని విశేషాలను త్వరలోనే ప్రేక్షకులకు తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

నటీనటులు:
అల్లు అర్జున్, రష్మిక మందన తదితరులు

టెక్నికల్ టీం:
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యేర్నేని, రవి శంకర్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: మిరస్లో కుబా
PRO: ఏలూరు శ్రీను, మాడూరి మధు

Introducing Pushpa Raj | Allu Arjun | Pushpa | Rashmika | Fahadh Faasil | DSP | Sukumar – YouTube

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here