‘తెర కోసం వేషాలు’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

 

“V” ప్రొడక్షన్ హౌస్ సంస్థ నిర్మాణ సారధ్యంలో, మనోజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “తెర కోసం వేషాలు”. ఈ చిత్రం యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది సినిమా టీం.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీను సునీల్ మాట్లాడుతూ “జీవన్ రెడ్డి చెప్పిన కథ చాలా బాగుంది. వెంటనే షూటింగ్ మొదలుపెట్టాం. షూటింగ్ అంత పూర్తి అయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా లో నటించాలని తెరపై తమను తాము చూసుకోవాలని, సినీరంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని కొందరు యువకులు చేసే ప్రయత్నమే మా సినిమా కథ. అయితే ఆ యువకులకి కరోనా ఎలాంటి సమస్యలు తెచ్చింది, వాళ్ళు వాటిని ఎలా ఎదురుకున్నారో తెలియాలి అంటే మా సినిమా కోసం మీరు ఎదురుచూడాల్సిందే. మంచి బడ్జెట్ తో నిర్మించాము. ఈ వారంలో ప్రొమోషనల్ సాంగ్ ని విడుదల చేస్తాము. ఆ వెంటనే సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తాం .మా టీం కి ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం అని నిర్మాత అన్నారు.

ఈ చిత్రానికి

సంగీతం- వి.ఆర్.ఏ.ప్రదీప్,

పబ్లిసిటీ డిజెన్స్;-రాహుల్,

కెమెరా :- క్రాంతి,

ఏడిటింగ్:- సత్య,

పి.ఆర్.ఓ- పవన్ పాల్ ,

సౌండ్ ఎఫ్ఎక్ట్స్ :- వెంకట్

డైరెక్టర్ : మనోజ్

నిర్మాత : శ్రీను సునీల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here